విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా యూనివర్శిటీకి విదేశీ కళ...కేటగిరీ-1 గుర్తింపు పెరగనున్న ఫారిన్ స్టూడెంట్స్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఆంధ్రాయూనివర్శిటీ అభివృద్ది పథంలో మరో ముందడుగు వేసింది. ఈ యూనివర్శిటీకి తాజాగా లభించిన ఒక ప్రత్యేక గుర్తింపుతో ఆకాశమే హద్దుగా అభివృద్ది పథంలో దూసుకుపోనుంది.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నా అనుమతుల బంధకాలతో పరిమిత అభివృద్దితో మందగమనంతో ముందుకు సాగుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇక అన్ని బంధనాలు తెంచుకోని విద్యారంగంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం లభించింది. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే...తాజాగా ఆంధ్రా యూనివర్శిటీకి కేటగిరీ-1 విశ్వవిద్యాలయంగా గుర్తింపు లభించింది. ఫలితంగా ఈ యూనివర్శిటీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా ఎదగడానికి మరింత అవకాశం లభించడంతో పాటు విదేశీ విద్యార్థులతో కళకళలాడే సావకాశం ఏర్పడింది.

కేటగిరి 1 గుర్తింపు...లభించింది

కేటగిరి 1 గుర్తింపు...లభించింది

తాజాగా ఆంధ్రా యూనివర్శిటీ మరో కీలకమైన మైలురాయి అధిగమించింది. దేశంలోని కేటగిరీ-1 విశ్వవిద్యాలయంగా ఆంధ్రా యూనివర్శిటీ స్థానం సంపాదించుకోవడంతో విద్యారంగంలో తన విశిష్టత చాటుకునేందుకు మరో చక్కటి అవకాశం లభించింది. అంతేకాదు అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా మరింత విస్తరించడానికి మంచి మార్గం దొరికింది.

కొన్నింటికే దక్కిన...అరుదైన అవకాశం

కొన్నింటికే దక్కిన...అరుదైన అవకాశం

కేటగిరి 1 గుర్తింపు దక్కించుకోవాలని దేశంలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అత్యున్నత విద్యాసంస్థలు ఆరాటపడతాయి. అయితే వీటన్నింటినీ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కేటగిరీలుగా విభజించి ప్రకటించింది. ఆయా విద్యా సంస్థలు అనురిస్తున్న బోధన ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు, మౌళిక వనరులను బట్టి అవి ఏ స్థాయిలో ఉన్నాయన్నది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కేటగిరీలుగా విభజించి ప్రకటించింది. అలా దేశవ్యాప్తంగా కేటగిరి-1 కు ఎంపిక చేసిన యూనివర్శిటీల్లో ఆంధ్రా యూనివర్శిటీకి స్థానం లభించడం గర్వకారణం. దేశం మొత్తం మీద కేవలం 23 విద్యాసంస్థలను మాత్రమే ఇలా కేటగిరీ-1కు ఎంపిక చేయడం గమనార్హం.

ప్రయోజనాలు ఏంటంటే

ప్రయోజనాలు ఏంటంటే

కేటగిరి 1 గుర్తింపు వల్ల ప్రధానంగా ఒనగూడే ప్రయోజనం అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా వేగంగా ఎదగడానికి అవకాశం లభించడం. దీంతోపాటు అటోమేటిగ్గా అనేక పరిమితులు, బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే అనేక అంశాలపై నిర్ణయం కోసం కేంద్ర మానవ వనరుల విభాగ అధికారుల అనుమతి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాదు కేటగిరీ-1 విద్యాసంస్థలకు కల్పించే "గ్రేటర్‌ అటానమీ"తో యూనివర్సిటీ దిశ దశ మారే పరిస్థితి ఉంటుంది.

 విదేశీ విద్యార్థులను...పెంచుకోవచ్చు

విదేశీ విద్యార్థులను...పెంచుకోవచ్చు

ఇప్పటివరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో కేవలం 15 శాతం లోపు సీట్లను మాత్రమే విదేశీ విద్యార్థులకు ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువమంది విదేశీ విద్యార్థులకు సీట్లు కేటాయించాలంటే తప్పనిసరిగా యు.జి.సి. అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఆయా అనుమతుల ప్రక్రియ కష్టతరమైంది కావడంతో పాటు విపరీత జాప్యానికి అవకాశం ఉండటంతో వర్సిటీ అధికారులు 15శాతం లోపు సీట్లతో సరిపుచ్చుకునేవారు. తాజాగా వర్సిటీకి కేటగిరీ-1 గుర్తింపు లభించిన నేపథ్యంలో ఇకపై ఈ పరిమితి వర్తించదు. యూనివర్సిటీ అనుకూలతలను బట్టి ఎంత మంది విదేశీ విద్యార్థులకైనా సీట్లు ఇచ్చుకునే సౌలభ్యం కలగనుంది. దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పెంచుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. అలాగే విద్యాబోధనకు విదేశీ ఆచార్యులను పిలిపించుకోవచ్చు.

 అంతర్జాతీయంగా...ఎదగొచ్చు

అంతర్జాతీయంగా...ఎదగొచ్చు

అసలు విద్యా బోధనలో అత్యున్నత ప్రమాణాల కోసం విదేశీ ఫ్యాకల్టీని పిలిపించుకోవడమే కాదు ఏకంగా ఇకపై విదేశీ ఆచార్యులను నేరుగా నియమించుకునే అవకాశం ఇకపై ఎయూకి లభించింది. నిష్ణాతులైన విదేశీ ఆచార్యులు కూడా వర్సిటీలో ఫ్యాకల్టీగా చేరితే వర్సిటీకి దేశీయ విద్యార్థుల నుంచే కాదు విదేశీవిద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. ఫలితంగా విదేశీ విద్యార్థుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతోపాటు, ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వీటన్నింటి ఫలితంగా వర్సిటీ స్థాయి పెరగడంతో పాటు రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రా యూనివర్శిటీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

 భారీ ఆదాయానికి...అవకాశం...

భారీ ఆదాయానికి...అవకాశం...

దేశీ విద్యార్థులతో పోలిస్తే విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులు భారీ ఆదాయం సమకూరుస్తాయి. అదే సమయంలో ఈ యూనివర్శిటీలో వివిధ దేశాల విద్యార్థుల సంఖ్య పెరిగితే వర్సిటీ అంతర్జాతీయ కళ సంతరించుకోవడంతో పాటు విభిన్న సంస్కృతుల సమాహారంగా మారి విద్యార్థుల ఆలోచనా ధోరణి కూడా అంతర్జాతీయ స్థాయిలో వికసించడానికి అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ సందర్భంగా యూనివర్శిటీ విసి ఆచార్య జి.నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేటగిరీ-1 గుర్తింపుతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులను వివిధ కోర్సుల్లో చేర్పించుకోవడానికి వీలుగా కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విదేశీ ఆచార్యులను కూడా వర్సిటీలోని వివిధ విభాగాల్లో నిర్ణీతకాలంపాటు నియమించేలా కూడా చర్యలు చేపడుతున్నాం. దేశీయ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కృషిచేస్తున్నామని చెప్పారు.

English summary
Visakhapatnam: Andhra University achieved category 1 accreditation. Central human resource department announced this status to 23 universities across the country and Andhra University is one among them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X