• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏయూ షాక్: ముందువరుసలో అమ్మాయిలు, బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు

|
  బాత్రూంలో కండోమ్స్, క్లాస్‌లో ఆ పాఠాలు, అమ్మాయిలు ముందు వరుసలో | Oneindia Telugu

  విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అమ్మాయిలపై ప్రొఫెసర్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. ప్రొఫెసర్లపై ఫిర్యాదు చేస్తే తమ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో చాలామంది మౌనంగా భరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.

  తాజాగా సంస్కృత విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఏడుకొండలుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయనపై గతంలోను ఈ ఆరోపణలు వచ్చాయి. వీటిపై వర్సిటీ కమిటీ వేసి విచారించింది. అనంతరం న్యాయమూర్తులతోను విచారణ చేయించారు.

   అప్పట్లోను ఆరోపణలు, చర్యలు

  అప్పట్లోను ఆరోపణలు, చర్యలు

  అప్పట్లో మహిళా ప్రొఫెసర్లు, కమిటీ సభ్యులు సంస్కృత విభాగంలోని చాలామంది విద్యార్థినులను వ్యక్తిగతంగా పిలిచి విచారించగా ఆచార్య ఏడుకొండలు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నదీ వివరించారు. చివరకు ఏడుకొండలు తీరుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నిర్ధరించింది. అనంతరం రెండేళ్లపాటు పాలన పదవులకు దూరం పెట్టాలన్న కమిటీ సూచనను అధికారులు అమలు చేశారు. ఆ గడువు ముగియడంతో గత మే నెలలో ఆయనకు విభాగాధిపతి పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

  ప్రొఫెసర్ కూడా బాధితురాలే

  ప్రొఫెసర్ కూడా బాధితురాలే

  ఏయూ రెక్టార్‌ ప్రొఫెసర్ గాయత్రీదేవి కూడా గతంలో ఏడుకొండలు కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఆమె కోర్టును ఆశ్రయించారు. తనను క్షమించమని ఏడుకొండలు లిఖితపూర్వకంగా కోరడంతో ఆమె తన కేసును ఉపసంహరించుకున్నారు.

   అక్కడ కండోంలు

  అక్కడ కండోంలు

  సంస్కృత విభాగంలోని విద్యార్థినుల మరుగుదొడ్లలో అప్పుడప్పుడూ కండోమ్‌లు కూడా కనిపిస్తున్నాయని కొందరు ఆవేదన చేస్తున్నారు. తమ ఆరోపణలు అవాస్తవాలని కొట్టి పారేస్తారన్న ఉద్దేశంతో వాటిని ఫొటోలు తీశామని వాటిని మీడియా ప్రతినిధులకు చూపించారు. తరగతి గదిలో సైతం ఏడుకొండలు తీరును భరించలేకపోతున్నామని అంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఏడుకొండలు కొట్టిపారేశారు. విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పలువురు విద్యార్థులకు నిర్ణీత హాజరు లేదని, వారిని పరీక్షకు పంపించమని చెప్పడంతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

   హాజరుపై నిలదీత

  హాజరుపై నిలదీత

  ఏడు కొండలు వేధింపులు తట్టుకోలేక తాము క్లాసులకు కూడా వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు కంటతడి పెడుతున్నారు. సోమవారం నుంచి సెమిస్టర్‌ పరీక్షలు మొదలయ్యాయి. హాజరు సరిపోలేదనే కారణంతో, పలువురు విద్యార్థులకు ఏడుకొండలు హాల్‌టికెట్లు నిలిపివేశారు. దీంతో, వారంతా చాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అటుగా వచ్చిన సీనియర్‌ ప్రొఫెసర్‌, రెక్టార్‌ గాయత్రిదేవికి తమ గోడు వినిపించారు. ఏడుకొండలుతో ఆయన చాంబర్‌లో గాయత్రిదేవి, ఇతర ఆచార్యులు చర్చించారు. ఇంతలో కొందరు విద్యార్థులు చాంబరులోకి చొచ్చుకొచ్చి స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న రోజులకు హాజరుని ఎందుకు పరిగణించలేదని నిలదీశారు. వారు మెరుపు ఆందోళన నిర్వహించారు. ఆ ప్రొఫెసర్‌ను చితకబాదారు.

   ముందు వరుసలో అమ్మాయిలు కూర్చోవాలని షరతు

  ముందు వరుసలో అమ్మాయిలు కూర్చోవాలని షరతు

  ఏడుకొండలు చేష్టలకు భయపడే తాము తరగతులకు హాజరుకావడం లేదని రెక్టార్‌కు విద్యార్థులు వివరించారు. క్లాసులో అమ్మాయిలు ముందు వరుసలో కూర్చోవాలని ప్రొఫెసర్‌ షరతు పెట్టారని, పొరపాటున అబ్బాయిలు ఉంటే ఊరుకోరని, తమ ఎదుటే శృంగార పాఠాలు బోధిస్తారని, ఆ సమయంలో స్త్రీని ఎంతో దారుణంగా వర్ణిస్తారని, హావభావాలూ ప్రదర్శిస్తారని, ఆయన తీరుతో సిగ్గుతో చచ్పిపోతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  మంత్రి సీరియస్

  మంత్రి సీరియస్

  ఈ ఘటనపై మంత్రి గంటా శ్రీనివాస రావు తీవ్రంగా స్పందించారు. ఏడుకొండలుపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేసి విచారణ చేయాలని రిజిస్ట్రార్‌ ఆచార్య ఉమామహేశ్వరరావును ఆదేశించారు. కాగా, ఘటనపై రెక్టార్‌ ఆచార్య గాయత్రిదేవి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రామ్మోహనరావులు అటు విభాగాధిపతి, ఇటు విద్యార్థులను పిలిచి మాట్లాడారు. విద్యార్థులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A group of students and research scholars of Andhra University targeted the head of the Sanskrit department, Prof K Yedukondalu, here on Monday, charging him with harassing girl students. Based on a complaint, the III Town police registered a case against the professor.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more