విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్:ఆంధ్రా యూనివర్శిటీ వెబ్‌సైట్‌ హ్యాక్‌..పాకిస్తాన్ అనుకూల నినాదాలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ఆంధ్రా యూనివర్శిటీ ఊషించని షాక్ తగిలింది. ఈ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్‌ చేశారు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు కనిపిస్తుండటంతో షాక్ తినడం అధికారుల వంతయింది.

మంగళవారం ఆంధ్రా యూనివర్శిటీ అఫీషియల్ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే అందులో ఫ్రీ కాశ్మీర్‌, పాకిస్తాన్‌ జిందాబాద్‌ అనే నినాదాలు దర్శనమిచ్చాయి. దీంతో వెబ్ సైట్ హ్యాక్ అయిన విషయాన్ని గుర్తించిన యూనివర్శిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే విసి ఫ్రొఫెసర్ జి.నాగేశ్వరరావు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.

Andhra University Website Hacked By Pakistan Group

వెంటనే నష్ట నివారణా చర్యలు ప్రారంభించాల్సిందిగా విసి యూనివర్శిటీ సాంకేతిక సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇది నిజంగా పాకిస్తాన్ అనుకూల గ్రూప్ ల పనేనా లేక ఆకతాయిల చర్యా అనేది తెలుసుకునేందుకు యూనివర్శిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Visakhapatnam:The website of prominent educational institution in Andhra Pradesh, Andhra University today came under cyber-attack by some unknown Pakistani hackers who posted pro-pakistani messages on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X