India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వంలో మరో కొత్త విప్ -సీఎం జగన్ నిర్ణయం : ఇప్పుడెందుకంటే...!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరపున మరో విప్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యేగా ఉన్న దాడిశెట్టి రాజా ప్రభుత్వ విప్ గా ఉన్నారు. అదే జిల్లా కు చెందిన మరో ఎమ్మెల్యేకు విప్ గా అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వం నుంచి చీఫ్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. విప్ లుగా కొరుముట్ల శ్రీనివాసులు.. ఉదయభాను..పార్ధసారధి..చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. దాడిశెట్టి రాజా..ముత్యాల నాయుడు ఉన్నారు.

విప్ గా జగ్గిరెడ్డికి అవకాశం..

విప్ గా జగ్గిరెడ్డికి అవకాశం..

వీరితో పాటుగా తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యేగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బడిబాట ..నాడు - నేడు కార్యక్రమ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తూర్పు గోదావరి పి గన్నవరం నియోజకవర్గానికి వెళ్లారు. ఆ సమయంలో సీఎం ను కలిసిన జగ్గిరెడ్డి.. తాను తొలి నుంచి జగన్ తోనే ఉన్నానని..ప్రభుత్వ పరంగా ఏదైనా పోస్టులో అవకాశం కల్పించాలని కోరారు. త్వరలో జరగనున్న మంత్రివర్గంలో జగ్గిరెడ్డి తనకు బెర్తు దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. దీంతో..ముఖ్యమంత్రి ఆయనకు విప్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జగన్ కు విధేయుడిగా...వైసీపీలోనే..

జగన్ కు విధేయుడిగా...వైసీపీలోనే..

జగ్గిరెడ్డి 2004లో కాంగ్రెస్ నుంచి కొత్తపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావు చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఓటమి పాలయ్యారు. తిరిగి 2014, 2019 లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి వరుసగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ హయాంలో జగ్గిరెడ్డి పైన పార్టీ మార్పు దిశగా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. కానీ, జగ్గిరెడ్డి తాను జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. తొలి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తో ఉన్న జగ్గిరెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారని ఆశించారు.

తూర్పు గోదావరి సమీకరణాల్లో భాగంగా..

తూర్పు గోదావరి సమీకరణాల్లో భాగంగా..

అయితే, సామాజిక సమీకరణాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు వర్గంలో కన్నబాబుకు, బీసీ-శెట్టి బలిజ వర్గం నుంచి తొలుత పిల్లి సుభాష్ చంద్ర బోస్, ఆయన రాజ్యసభకు వెళ్లటంతో ఆయన స్థానంలో వేణు గోపాల క్రిష్ణకు అవకాశం దక్కింది. ఇక, ఎస్సీ కోటా నుంచి సీనియర్ నేత విశ్వరూప్ కు ఛాన్స్ ఇచ్చారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. అందులోనూ వ్యక్తులు మారినా...జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల ఆధారంగా తిరిగి ఇవే సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

మంత్రి పదవి కోసం ఆశావాహుల వెయిటింగ్..

మంత్రి పదవి కోసం ఆశావాహుల వెయిటింగ్..

దీంతో.. చర్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా వైసీపీ ఎమ్మెల్యేగా..టీడీపీ సీనియర్ నేత యనయల సోదరుడి పైన గెలిచిన దాడిశెట్టి రాజా సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు మంత్రివర్గంలో స్థానం కోసం సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కన్నబాబు స్థానంలో మరొకరికి అవకాశం దక్కుతుందా అనే చర్చ ఇప్పుడు జిల్లా పార్టీలో కొనసాగుతోంది.

మార్పులు - చేర్పుల పైన అంచనాలు..

మార్పులు - చేర్పుల పైన అంచనాలు..

కన్నబాబు శాఖా పరంగా పర్వాలేదనే స్థాయిలో పని చేస్తున్నా.. పార్టీ పరంగా జిల్లాలో-నియోజకవర్గంలో అంతగా సమర్ధవంతంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల టీం సిద్దం చేసుకుంటున్న సీఎం జగన్.. అన్ని కోణాల్లోనూ సమర్ధతను పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, సభలోనూ-బయటా ప్రభుత్వ వాయిస్ వినిపించటంలో మాత్రం కన్నబాబు ముందున్నారు. ఇక, ఇప్పుడు జగ్గిరెడ్డికి విప్ పదవి ఇవ్వటంతో జిల్లాలో మారనున్న సమీకరణాల పైన సీఎం జగన్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
East Godavari district Kothapet MLA Chirla Jaggireddy is appointed as Whip in AP Govt. CM jagan decided to utilise his services as WHIP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X