ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. 840 మందికి పాజిటివ్.. విశాఖలో ఒకరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తోంది. రోజు రోజకు కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో37, 849 మందిని పరీక్షలు నిర్వహించారు. వారిలో 840 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. విశాఖపట్నంలో ఒకరు మృతి చెందినట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు
ఏపీలో
కరోనా
కేసులు
తాజా
హెల్త్
బులిటెన్
ను
వైద్య,
ఆరోగ్య
కరోనా
విడుదల
చేసింది.
గడిచిన
24
గంటల్లో
840
కొత్త
కేసులు
వచ్చినట్లు
తెలిపింది.
దీంతో
రాష్ట్రం
వ్యాప్తంగా
మొత్తం
పాజిటివ్
కేసుల
సంఖ్య
20,76,868కి
పెరిగింది.
కరోనా
బారినపడి
డిశ్చార్జ్
అయిన
వారి
సంఖ్య
20,59,395
చేరింది.
ఇప్పటి
వరకు
కరోనా
వైరస్‌తో
14,501
మంది
మరణించారని
ఆరోగ్య
శాఖ
వెల్లడించింది.
ప్రస్తుతం
యాక్టివ్
కేసులు
2,972
ఉన్నట్లు
తెలిపింది.

విశాఖలో ఒకరు మృతి
రాష్ట్రంలో
ఇప్పటి
వరకు
3,15,29,919
కరోనా
టెస్ట్‌లు
చేసినట్లు
వైద్య,ఆరోగ్య
శాఖ
వెల్లడించింది.
నిన్న
ఒక్కరోజే
37,849
మందికి
పరీక్షలు
నిర్వహించినట్లు
తెలిపింది.
గడిచిన
24
గంటల్లో
133
మంది
బాధితులు
కరోనా
నుంచి
కోలుకోగా,
విశాఖ
పట్నంలో
ఒకరు
మృతి
చెందినట్లు
తెలిపింది.
ఏపీలో
ఇప్పటి
వరకు
28
ఒమిక్రాన్
కేసులు
నమోదయ్యాయి
అని
అధికారులు
ప్రకటించారు.

అత్యధిక పాజిటివ్ కేసులు మూడు జిల్లాల్లోనే
ఏపీలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 183, చిత్తూరు 150, కృష్ణాలో 88 , తూర్పుగోదావరి 70 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య రాను రాను ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ కరోనా వ్యాప్తి విజృభింస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.