వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డిపై కేసు ఉపసంహారణ, పార్టీ మారినందుకేనా?

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డిపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకొంది.2014 జూన్ 30న, గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో ఆశోక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డిపై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకొంది.2014 జూన్ 30న, గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో ఆశోక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది.అయితే పార్టీ మారినందునే ఆయనపై నమోదైన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకొందని వైసీపీ ఆరోపిస్తోంది.

గిద్దలూరులో 2014 లో జరిగిన ఎన్నికల్లో ఆశోక్ రెడ్డి వైసీపీ తరపున పోటీచేసి విజయం సాధించాడు.అయితే ఏడాది క్రితం ఆయన వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే 2014 జూన్ లో గిద్దలూరు పోలీస్ స్టేషన్ లో ఆయనతో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది.

Andhrapradesh governament withdraw a case on Giddalur MLA Ashok reddy

గిద్దలూరు పట్టణంలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మరణిండంతో ఆశోక్ రెడ్డి ఆయన అనుచరులు పోలీస్ వాహానాన్ని ఓ షోరూమ్ ను దగ్దం చేసిన కేసులున్నాయి.అయితే ఈ కేసులకు సంబంధించి పట్టణంలో చాలాకాలంపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆశోక్ రెడ్డి 2016 జూన్ 1వ, తేదిన వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే ఆయన పార్టీ మారి ఈ ఏడాది జూన్ వస్తే ఏడాది అవుతోంది. ఏడాది కాకముందే ఈ కేసును తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు ఈ కేసును ఉఫసంహరించుకొంటున్నట్టుగా మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే పార్టీ మారినందునే ఎమ్మెల్యే ఆయన అనుచరులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకొందని వైసీపీ ఆరోపిస్తోంది.

English summary
Andhrapradesh governament withdraw a case on Giddalur MLA Ashok reddy and his followers on Tuesday.In 2014 june 30, a case filed on MLA Ashok Reddy and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X