వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరో మూడురోజుల వర్షాలు-కోస్తా జిల్లాల్లో ప్రభావం- అల్పపీడనంగా మారిన వాయుగుండం

|
Google Oneindia TeluguNews

ఏపీలో మరో అల్పపీడనం ప్రభావం చూపుతోంది. నిన్న వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలైన పశ్చిమబెంగాల్ తీరాల్లో తీవ్ర అల్పపీడనం నుంచి అల్ప పీడనముగా బలహీనపడంది. ఈ అల్పపీడనమునకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 4,5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాలపై ప్రభావం పడనుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అమరావతి వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముందని వెల్లడించింది. రేపు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఒకటి లేదా రెండు చోట్లఉరుములు, మెరుపులు సంభవించే అవకాశాలు ఉన్నాయి.

andhrapradesh to get three day moderate rains with latest depression in bay of bengal

అటు దక్షిణ కోస్తా ఆంధ్రలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముందని వాతావరణ విభాగం వెల్డడించింది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ విభాగం వెల్లడించింది.

మరోవైపు ఇప్పటికే జవాద్ తుపాను ముప్పు తొలగిపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న కోస్తాంధ్ర జిల్లాలకు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో రైతుల పంటలకు ఈ వరుస వర్షాలతో ముప్పు తప్పేలా లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో పంటనష్టం అధికంగా ఉంది.

English summary
with latest depression in bay of bengal, andhrapradesh to get moderate rains across coastal districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X