హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సునిత రావాల్సిందే: అంగన్‌వాడి ధర్నాఉద్రిక్తం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ (ఇందిరా పార్కు) వద్ద అంగన్ వాడి కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్, రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు, కార్యకర్తలు సోమవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలనేది వారి ప్రధాన డిమాండ్.

ఇందులో భాగంగా సోమవారం వేల సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు హైదరబాద్‌కు చేరుకున్నారు. ఇందిరా పార్కు వద్ద భారీ ధర్నా చేపట్టారు. అనంతరం రాజ్ భవన్, సచివాలయ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అరెస్టు చేసిన కార్యకర్తలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

మిగిలిన కార్యకర్తలు పోలీసు వాహనాలు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కాగా, మంత్రి సునిత లక్ష్మా రెడ్డి వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆమె వచ్చే వరకు తాము తగ్గేది లేదన్నారు. అంగన్ వాడి కార్యకర్తలకు సిపిఐ, తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపింది.

అంతకుముందు, అంగన్‌వాడీ ఛలో హైదరాబాద్‌కు అనుమతి లేదని సోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అంగన్‌వాడీ ఉద్యోగులును పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు పోలీసుల అడ్డంకులను తొలిగించుకుని ఇందిరా పార్క్ వద్దకు చేరుకునని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.

అంగన్ వాడి

అంగన్ వాడి

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద అంగన్ వాడీ కార్యకర్తలు మహా ధర్నా కార్యక్రమాన్ని చేప్టటారు.

అంగన్ వాడి

అంగన్ వాడి

అంగన్ వాడీలు చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వడంతో ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఇందిరాపార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

అంగన్ వాడి

అంగన్ వాడి

రాష్ట్రం నలుమూలల నుంచి రైళ్లలో, బస్సుల్లో బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలు ఈ ధర్నాకు ఇంకా తరలి వచ్చారు. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో నగరానికి చేరుకున్న అంగన్ వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంగన్ వాడి

అంగన్ వాడి

చాలామందిని మహా ధర్నాకు వెళ్లకుండా నిలువరించారు. అంగన్ వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17 నుంచి నిరవధికంగా నిరసన తెలుపుతున్నారు.

అంగన్ వాడి

అంగన్ వాడి

కనీస వేతనం పెంపు, అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 11 డిమాండ్లను పరిష్కరించాలని అంగన్ వాడీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

English summary
Anganwadi employees stage dharna at Indira Park on Monday and gave slogans against Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X