అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి భూములపై కీలక నిర్ణయం: చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అమరావతిలో అంబాని! ఏం జరుగుతుంది???

అమరావతి: కేంద్ర సంస్థలకు వివిధ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన భూముల ధరలు తగ్గించాలనే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఉన్నారు. మరోవైపు, ఇతర సంస్థలకు ఇచ్చిన భూములపై కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అడాగ్ అధినేత అనిల్ అంబాని సోమవారం చంద్రబాబును కలిశారు.

మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు: పవన్ కళ్యాణ్, 'అది శక్తికిమించిన పని'మీరు అడగవద్దు, నేను చెప్పవద్దు: పవన్ కళ్యాణ్, 'అది శక్తికిమించిన పని'

నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను అడాగ్ గ్రూప్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ అమరావతికి వచ్చి బాబుతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

అందుకే ఈ కీలక నిర్ణయం

అందుకే ఈ కీలక నిర్ణయం

కేంద్రం ప్రభుత్వ సంస్థల ఏర్పాటు కోసం అమరావతిలో ఇచ్చిన భూముల ధరలను తగ్గించాలని సీఎం చంద్రబాబు యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సంస్థలు వేగంగా భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇక్కడి నుంచే కార్యకలాపాలను ప్రారంభించేలా చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఆ సంస్థలకు కూడా

ఆ సంస్థలకు కూడా

కేంద్ర ప్రభుత్వ సంస్థల భూములతో పాటు రాజధానిలో భూములు కేటాయించి, ఇంకా నిర్మాణాలు ప్రారంభించని ఇతర సంస్థలకు సీఆర్డీఏ లేఖలు రాస్తోందని తెలుస్తోంది. భూములు కేటాయించి ఇన్ని రోజులు అయినా నిర్మాణాలు ప్రారంభించని విషయాన్ని గుర్తు చేస్తోంది. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వెంటనే అక్కడ భవనాల నిర్మాణం చేపట్టేలా చూడాలని కోరుతోంది.

నిర్మాణాలపై ఆరా

నిర్మాణాలపై ఆరా

గత వారం కేబినెట్ ఉప సంఘం సమావేశంలో భూముల కేటాయింపు, నిర్మాణాలపైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్ని సంస్థలకు భూములిచ్చారు, ఎన్ని నిర్మాణాలు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించలేదనే అంశాలపై ఆరా తీశారు. మొత్తం 67 సంస్థల వరకూ ఇంకా ముందుకు రాని విషయం గుర్తించారు. దీంతో భూములు కేటాయించిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ వారికి లేఖలు రాయాలని నిర్ణయించారు.

 వారి నుంచి స్పష్టత తీసుకోనున్నారు

వారి నుంచి స్పష్టత తీసుకోనున్నారు

వారితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమై నిర్మాణాల ఆలస్యానికి కారణాలు తెలుసుకోనున్నారు. ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారో స్పష్టత తీసుకోనున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు సంబధిత సంస్థలకు లేఖలు రాస్తున్నారు. ఈ నిర్ణయం తర్వాత కేంద్రం పరిధిలోని ఆర్బీఐ, నాబార్డు, సీపీడబ్ల్యూడీ, హెచ్‌పీసీఎల్, సీఐటీడీ తదితర సంస్థలకు భూముల ధరలు తగ్గనున్నాయి.

English summary
Anil Ambani to meet Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X