వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి:నేడు సిఎస్‌గా అనిల్‌చంద్ర పునేఠా బాధ్యతల స్వీకరణ;మరి ఎల్ వి సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏంటి?

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌)గా అనిల్‌చంద్ర పునేఠా ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సిసిఎల్‌ఎ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అనిల్‌చంద్ర పునేఠా ఎపి సిఎస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాది బ్రాహ్మణులైన పునేఠా మంచి ముహూర్తం దృష్ట్యా ఆదివారమే ఈ బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించుకొని ఉంటారని కొందరు ఉన్నతాధికారులు ఆఫ్ ది రికార్డ్ గా అంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుత సిఎస్‌ దినేష్‌కుమార్‌ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే.

పునేఠా...ప్రస్థానం

పునేఠా...ప్రస్థానం

ఇక పునేఠా విద్య, అధికార ప్రస్థానం విషయానికొస్తే... ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి సాధారణ డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బి పట్టా పొందిన ఈయన అనంతరం ఇంగ్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ ఏంజిలియాలో గ్రామీణాభివృద్ధి విభాగంలో ఎంఎ పూర్తిచేశారు. ఆ తరువాత 1984లో ఐఎఎస్‌కు ఎంపికైన ఆయన కడప జిల్లా రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా ఎపిలో తన తొలి ఉద్యోగం చేపట్టారు. అనంతరం కాలంలో విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గానూ విధులు నిర్వహించారు.

విధుల నిర్వహణ...ఇక్కడ ఇలా...

విధుల నిర్వహణ...ఇక్కడ ఇలా...

మెదక్‌, కర్నూలు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా, మెదక్‌ డిఆర్‌డిఎ పివోగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా, ఎపి స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండిగా విధులు నిర్వహించారు. నీటి పరిరక్షణ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గానూ, గ్రామీణాభివృద్ధి, ఉద్యానశాఖ కమిషనర్‌గానూ పనిచేశారు. వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌గా, వ్యవసాయ, రెవెన్యూశాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. నేడు ఎపి సిఎస్ గా బాధ్యతలు చేపట్టే అనిల్‌చంద్ర పునేఠా మరో తొమ్మిది మాసాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 'పునీతా' సర్వీసు వచ్చే ఏడాది మే నెలాఖరుకి ముగియనుంది.

ఎల్వీకి అన్యాయం...జరిగిందా?

ఎల్వీకి అన్యాయం...జరిగిందా?

అయితే అనిల్‌చంద్ర పునేఠాకు సిఎస్ పదవి కట్టబెట్టడం ద్వారా నిజాయితీపరుడు, సమర్థుడు,సర్వీసులో మచ్చలేని అధికారిగా పేరు తెచ్చుకున్న తెలుగు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యంకు చంద్రబాబు అన్యాయం చేశారనే మాట ఎపి ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోందంటున్నారు.
ఇప్పుడు తన కన్నా జూనియర్‌ అయిన అధికారి కింద ఎల్వీ ఎలా బాధ్యతలు నిర్వహిస్తారు...? అనేది చర్చనీయాంశంగా మారిందట. ఒకప్పుడు ఎల్‌వి కలెక్టర్‌గా ఉన్నప్పుడు 'పునీతా' సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు.

సిఎం...హామీ?

సిఎం...హామీ?

అయితే ఇప్పటికే రెండుసార్లు 'ఎల్‌వి'ని టిడిపి ప్రభుత్వం అవమానించిందని, ఇప్పుడు మరోసారి అవమానించడం తగదని...కొందరు అధికారులు సిఎంకు సూచించారని...ఈ క్రమంలో ఆయన ఎల్‌విని పిలిపించి ఖచ్చితంగా సముచిత స్థానాన్ని కల్పిస్తామని, 'పునీతా'కు మరో తొమ్మిది నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది కాబట్టి ఆయన రిటైర్మెంట్ తరువాత మీకే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

English summary
Amaravathi: Anilchandra Puneta will take charges as as Chief Secretary of Government of Andhra Pradesh on today. Currently he is the CCLA's Chief Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X