వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రదర్ అనిల్ సభల్లో కల్పన ప్రచారం, వదిలేశానని కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil Kumar code violation
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బావ అయిన అనిల్ కుమార్ శుక్రవారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం అడ్డాల సువార్త సభల్లో జగన్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ సభకు అనిల్ కుమార్, జగన్ పార్టీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన హాజరయ్యారు.

ఈ సభలో కల్పన.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయాలంటూ ప్రచారం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అభ్యంతరం తెలపడంతో కల్పన వెనుదిరిగారు. ఈ వ్యవహారంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ నేతలు కోడ్ ఉల్లఘించారని స్పష్టం తెలిసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా, సువార్త సభలకు రావడానికి అనిల్ ఉపయోగించిన వాహనంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాలున్నాయి.

టిడిపి వర్సెస్ జగన్ పార్టీ

కృష్ణా జిల్లాలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు నేతల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. కోడూరు మండలం కంభంపాడులో జగన్ పర్యటన ముగిసిన తర్వాత ఆ పార్టీ నేతలు టిడిపితో వాగ్వాదానికి దిగారు. వారిపై దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు టిడిపి నేతలకు గాయాలయ్యాయి.

తూగోలో కిరణ్

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు జాతికి తీవ్రనష్టం జరిగిందన్నారు. విభజనకు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కారణమని, ఆ పార్టీలకు ఓటేస్తే విభజనకు ఓటేసినట్లే అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం తాను సిఎం పదవిని సైతం వదులుకున్నానని చెప్పారు.

English summary
Brother Anil Kumar code violation in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X