వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం పీకలేరు! జగన్ సింహం సింగిల్‌గానే.: పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై మంత్రి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు కూడా ఆయన పోరాటం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇవాళ పొత్తు, రేపు విలీనమంటూ బీజేపీతో జనసేన పొత్తుపై ఆయన వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు.. జీవితంలోనూ నటుడే..

పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు.. జీవితంలోనూ నటుడే..

శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనకు పుచ్చలపల్లి, చెగువేరా ఆదర్శమని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మోడీని తిట్టిన పవన్ ఇప్పుడు ఆయన చుట్టూ తిరిగి బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవతంలోనూ నటిస్తాడనడానికి ఇదే నిదర్శనమన్నారు.

పవన్ కళ్యాణ్‌ది పూటకో మాట.. రోజుకో వేషం..

పవన్ కళ్యాణ్‌ది పూటకో మాట.. రోజుకో వేషం..

పవన్ కళ్యాణ్ సినిమాలో రోజుకో వేషం వేస్తారని.. నిజ జీవితంలో మాత్రం ఆర్నేళ్లకో వేషం మారుస్తున్నారని మంత్రి అనిల్ విమర్శించారు. పొద్దునో మాట.. సాయంత్రం ఓ మాట మాట్లాడే వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం అని అన్నారు. ఆయన గురించి కూడా మాట్లాడాలా? అంటూ పవన్ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన పార్టీకి గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు వచ్చిందని.. పవన్ కళ్యాణ్ కూడా గెలవలేకపోయారని అన్నారు. జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను గౌరవించుకోలేకపోతున్నారని మంత్రి అన్నారు. తాను గెలవలేదనే భావంతో రాపాకను పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారని అన్నారు.

Recommended Video

Anil Kumar Yadav Slams Pawan Kalayan On His Comments Against CM Jagan || Oneindia Telugu
జగన్ పాలన బాగుండబట్టే.. సినిమాల్లోకి పవన్ కళ్యాణ్..

జగన్ పాలన బాగుండబట్టే.. సినిమాల్లోకి పవన్ కళ్యాణ్..

జగన్ పారిపాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలిసిందని.. అంటే జగన్ పాలన బాగున్నట్లేనని ఆయన ఒప్పుకున్నట్లే కాదా? అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాన్ బీజేపీతో కలిసినా.. టీడీపీకి దత్తత పుత్రిడిగా ఉన్నా తమకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. ఇప్పటికే వారందర్ని ప్రజలు తిరస్కరించారన్నారు.

ఎంతమంది వచ్చినా ఏం పీకలేరు..

ఎంతమంది వచ్చినా ఏం పీకలేరు..

జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదుర్కోలేక ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికల్లో కూడా బహిరంగంగా, తెరవెనుక పొత్తులు సాగించారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి గుంపులుగా వస్తున్నారని అన్నారు. ఎంతమంది వచ్చినా పీకేందేం లేదని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. జగన్‌ను టచ్ కూడా చేయలేరని అన్నారు.

సింహం సింగిల్‌గానే.. అంటూ జగన్‌పై...

సింహం సింగిల్‌గానే.. అంటూ జగన్‌పై...

పవన్ కళ్యాణ్ పది మందితో కలిసి వచ్చినా.. జగన్‌ను ఏమీ చేయలేరని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. జగన్ 8 నెలల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. వీళ్లంతా గుంపులుగా వచ్చినా.. సింహం సింగిల్‌గా వస్తుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. వీరిది ఏ గుంపు తేల్చేకోవాలన్నారు.

English summary
anil kumar yadav hits out at pawan kalyan for alliance with bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X