వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల వాకిట్లో సినీతార అంజలి: ఏ పార్టీలోకి ఎంట్రీ?

అంజలి గుర్తుండే ఉంటుంది. అచ్చ తెలుగు హీరోయిన్‌గా సీతమ్మ వాకిట్లో చిరుమల్లెచెట్టు సినిమాతో ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హీరోయిన్ అంజలి గుర్తుండే ఉంటుంది. అచ్చ తెలుగు హీరోయిన్‌గా సీతమ్మ వాకిట్లో చిరుమల్లెచెట్టు సినిమాతో ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సినీ నటీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తమిళ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నటీనటులు గతంలో తమ సత్తా చాటారు. ఇప్పుడూ చాటుతున్నారు. తమిళ రాజకీయాలు ప్రస్తుతం ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌ల చుట్టే తిరుగుతున్నాయి..

వారిద్దరు రాజకీయాల్లోకి రావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో ఎన్టీ రామారావు ఏకంగా పార్టీని స్థాపించి ముఖ్యమంత్రే అయ్యారు.

ఇప్పటికే వీరంతా...

ఇప్పటికే వీరంతా...

సినీ తారలు రోజా, నగ్మా, కుష్బు వంటివారు రాజకీయాల్లో నిండా మునిగిపోయారు. ఇక అంజలి వారి సరనస చేరుతుందనే ప్రచారం సాగుతోంది. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో అంజలి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు.

Recommended Video

"Aunty "Is The Suitable Word For YSRCP MLA Roja : TDP MLA Bonda Uma - Oneindia Telugu
ఇలా సంచలనం....

ఇలా సంచలనం....

పినతల్లితో విభేదాలతో, నటుడు జైతో ప్రేమాయణంతో వార్తల్లోకి ఎక్కి అంజలి సంచలన తారగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి, పార్లమెంటును సందర్శించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితోనే ఆమె పార్లమెంటు ఎలా నడుస్తుందనే విషయాన్ని పరిశీలించినట్లు చెబుతున్నారు.

తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన అంజలి

తన ఇష్టాన్ని వ్యక్తం చేసిన అంజలి

తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని, నిత్యం వాటిని పరిశీలిస్తుంటానని అంజలి ఇటీవల ఓ భేటీలో చెప్పారు. దాంతో మీడియా ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై కథలు అల్లుతూ వస్తోంది. ఆ ఒక్క మాటతో ఆమె చుట్టూ మీడియా వార్తలు తిరుగుతూ వస్తున్నాయి.

జగన్ పార్టీలోకే....

జగన్ పార్టీలోకే....

అంజలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అంటున్నారు. ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ఆమె నటించిన బెలూన్ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

English summary
It is said that Seethamma Vakitlo Chirumalle chettu fame Anjali may enter into Andhra Pradesh politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X