గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ అవినీతిపై సీబీఐ విచార‌ణ చేయాలి: జ‌గ‌న్‌ను క‌లిసి అభ్య‌ర్దిస్తా: నాటి టీడీపీ నేత సంచ‌ల‌నం..!

|
Google Oneindia TeluguNews

టీడీపీని వీడి బీజేపీ చేరిన నేత‌లు లోకేశ్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఐటీ శాఖా మంత్రిగా లోకేశ్ భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్య‌లు చేసారు. లోకేశ్ అవినీతి పైన ఏపీ సీఎం జ‌గ‌న్ ను క‌లిసి సీబీఐ విచార‌ణ కోరుతాన‌ని స్ప‌ష్టం చేఆరు. చంద్ర‌బాబును నిండా లోకేష్ ముంచేసార‌ని ఆరోపించారు. లోకేశ్ కార‌ణంగానే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిందంటూ ధ్వ‌జమెత్తారు.

సీఎంను క‌లుస్తా..విచార‌ణ కోరుతా
కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ టీడీపీలో ఉండి..బీజేపీలో చేరిన అన్నం స‌తీష్ టీడీపీ నేత లోకేశ్ పైన మ‌రోసారి విరుచుకు ప‌డ్డారు. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటుగా టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రితో ఉన్న సాన్నిహ‌త్యం కార‌ణంగా ఆయ‌న బాట‌లోనే బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీకి రాజీనామా చేసిన వెం ట‌నే లోకేశ్ మీద విరుచుకుప‌డిన అన్నం స‌తీష్ ఇప్పుడు మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు.

Annam Satish said that Shortly he will meet CM jagan and request for CBI investigation on Lokesh

లోకేశ్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఐటీ శాఖ‌లో భారీగా అవినీతి చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. దీని మీద సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని రెండు మూడు రోజుల్లో ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేస్తాన‌ని అన్నం స‌తీష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. సీబీఐ విచార‌ణ దిశ‌గా కేంద్రానికి నివేదించ‌మ‌ని అభ్య‌ర్దిస్తాన‌ని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుడు లోకేషే నిండా ముంచారని అభిప్రాయపడ్డారు.

త్వ‌ర‌లో టీడీపీ ఖాళీ కానుంది..
అన్నం స‌తీష్ మాజీ మంత్రి లోకేశ్ మీద త‌న విమ‌ర్శ‌లు కొన‌సాగించారు. లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని పున‌రుద్ఘాటించారు. ఆయన కారణంగా చాలామంది నేతలు తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. లోకేష్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని సతీష్ స్ప‌ష్టం చేసారు. టీడీపీ అభివృద్ధి కోసం వాల్ పోస్టర్లు కూడా అంటించానని.. సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపిం చానని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌లా తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదని విమర్శించారు. లోకేష్ కారణంగా త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికి రాజీనామా చేసి బీజేపీ లో చేరానని గుర్తు చేసిన స‌తీష్‌..త్వ‌ర‌లోనే అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని చెప్పుకొచ్చారు.

English summary
Ex MLC and TDP leader Annam Satish said that Shortly he will meet CM jagan and request for CBI investigation on Lokesh and he represented port folio IT and communications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X