వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్‌ వెల్లడి...

|
Google Oneindia TeluguNews

ఏపీలో జిల్లాల పునర్‌ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది.

Recommended Video

Andhra Pradesh : ఆ రోజే కొత్త జిల్లాల ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌!

మోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికిమోసపోయిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే - ఏపీ సీడ్స్ ద్వారా నకిలీ విత్తనాలు కొని - సీఎం జగన్‌ దృష్టికి

వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్‌ వ్యవస్ధీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండబోతోందని ఆయన ఇవాళ గుంటూరులో తెలిపారు. గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘుపతి ఈ విషయం పేర్కొన్నారు.

announcement of ap new districts in next january, says deputy speaker kona raghupathi

ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టత కారణంగా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని కోన రఘుపతి తెలిపారు. దీంతో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే అంశంపైనా క్లారిటీ వచ్చినట్లయింది. జిల్లాల సరిహద్దులతో పాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో రఘుపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English summary
andhra pradesh legislative assembly deputy speaker says that government will announce new districts in next january 26th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X