వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 12 గంటల్లో తుఫాన్ : తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి : కోస్తాంధ్ర, తమిళనాడు తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. మరో 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా మారుతోందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరగా కదులుతోందని వివరించారు.

తీవ్ర వాయుగుండం ...
శ్రీలంకలోని ట్రికోమాలికి తూర్పుదిశగా 870 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1500 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో తుఫాను గా మారనుందని అధికారులు వెల్లడించారు.

another 12 hours cyclone effect

గంటల్లో తుఫాను తీవ్రతరం
మరో 12 గంటల్లో తుఫానుగా మారి .. 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

English summary
Kostandhara storm over the Tamil Nadu coast. Meteorologists say the drainage in the next 12 hours will become storm. The current intensity depression in the Southeast Bay of Bengal has been moving closer to the Sri Lankan coast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X