వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు .. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాను అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు . ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న జగన్ హామీ నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. వైసీపీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని, జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.

సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు తరపున ప్రతినిధులుగా ఆ ఇద్దరుసీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు తరపున ప్రతినిధులుగా ఆ ఇద్దరు

ఇక కొత్తగా రానున్న 12 జిల్లాలు చూస్తే అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) అని తెలుస్తుంది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా ఉంటుందని సమాచారం.

 Another 12 new districts in AP .. officers are preparing the proposals

కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఇప్పుడప్పుడే వెలువడే పరిస్థితి లేనప్పటికీ, ఫైళ్లు మాత్రం చకచకా కదులుతున్నాయని తెలుస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసమే జగన్ తెలంగాణా రాష్ట్రం తరహా చిన్న జిల్లాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.

English summary
The successor state of Andhra Pradesh is going Telangana way. Taking a cue from Telangana which had formed new districts soon after the state has been carved out in 2014, new districts are likely to be formed in AP under Jagan's rule. Although the proposal to create new districts has come before thrice, it hadn't taken a shape back then. But Jagan is said to be keen on forming new districts to bring ease in administration. It is buzzed that 12 more new districts are under consideration in addition to existing 13 districts. As per reports, the new districts could be formed based on parliamentary constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X