వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో మూడురోజులు వర్షాలు, 3.5 నుంచి 4.5 మీటర్ల వరకు అలలు, చేపల వేటకు వెళ్లొద్దు..

|
Google Oneindia TeluguNews

ఉత్తర కోస్తా.. దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్లోని గాంగ్ టక్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తోన్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతోండగా.. హైదరాబాద్ నగరంలో ముసురేసింది. అయితే మరో మూడురోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి 3 రోజులు ఉత్తరాంధ్రతోపాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నది. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని.. తీర ప్రాంత ప్రజలు బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Recommended Video

Rains In AP : Alert! Another 3 Days Heavy Rains In AP & TS || Oneindia Telugu
ఎగిసిపడుతోన్న అలలు..

ఎగిసిపడుతోన్న అలలు..

సముద్రంలో అలజడి ఉంటుందని.. అలలు 3.5 నుంచి 4.5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టంచేసింది. విశాఖపట్టణం, గోదావరి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురువొచ్చని సంకేతాలు ఇచ్చింది. సోమవారం విజయనగరం, విశాఖలో వర్షం పడుతోందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటు వర్షం ఉంటుందని వివరించింది.

మూడురోజులు వానలే.. వానలే

మూడురోజులు వానలే.. వానలే

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో మంగళవారం వర్షం పడుతోందని తెలిపింది. గత మూడురోజుల నుంచి కృష్ణా, గోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనికితోడు మరో 3 రోజులు వర్షం కురిసే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ సూచించింది. తీరప్రాంతంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

తెలంగాణలో కూడా

తెలంగాణలో కూడా

ఉత్తర బంగాళాఖాతంలో 19 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. నేడు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
another three days very heavy rains likely some places in andhra pradesh, telangana states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X