భూమాలో మరో కోణం: మృత్యువును ముందే ఊహించారా? అఖిలతో ఆ మాటలు!

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ఈరోజు సభలోను విషన్నవదనంతో కనిపించారు. తల్లి మరణం నుంచి తేరుకుంటున్న సమయంలోనే తండ్రి కూడా తమను విడిచిపెట్టి పోవడం వారిని మరిం

ఆళ్లగడ్డ: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ఈరోజు సభలోను విషన్నవదనంతో కనిపించారు. తల్లి మరణం నుంచి తేరుకుంటున్న సమయంలోనే తండ్రి కూడా తమను విడిచిపెట్టి పోవడం వారిని మరింత క్షోభకు గురయ్యేలా చేసింది.

ఇదిలా ఉంటే, అకాల మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కొద్దిరోజులుగా నిరాశ నిస్పృహలో ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన నోటివెంట మృత్యువు సమీపిస్తోందన్న వ్యాఖ్యలు పరోక్షంగా వెలువడ్డాయి. నెలరోజుల క్రితం నుంచే పిల్లలకు పలు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఎవరితో ఎలా మసులుకోవాలి? ఎలా నడుచుకోవాలి వంటి సూచనలు చేసినట్లు చెబుతున్నారు.

అఖిలప్రియతో ఆవేదన:

అఖిలప్రియతో ఆవేదన:

శనివారం నాడు నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను వెంటబెట్టుకుని వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు భూమా నాగిరెడ్డి. శనివారం రాత్రి ఆళ్లగడ్డలోని నివాసానికి చేరుకున్నారు.

రోజూ పడుకునేముందు భార్య శోభానాగిరెడ్డి ఫోటో ముందు దీపం వెలిగించి పడుకోవడం భూమాకు అలవాటు. శనివారం రాత్రి కూడా శోభానాగిరెడ్డి ఫోటో వద్దకు వెళ్లిన ఆయన తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది.

'అఖిలా.. అమ్మ ఫొటో పక్కన నా ఫొటో ఉంటే ఇంకా బాగుంటుంది కదా!' అని కుమార్తె అఖిలతో ఆయన ఆవేదన చెందారు. గుంటూరులో కొత్తగా నిర్మిస్తున్న నివాసంలో భార్య శోభ ఫోటో పక్కన్నే తన ఫోటోను కూడా అందంగా చేయించి పెట్టాలని భూమా కుమార్తెకు సూచించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే భూమా మృత్యువును ముందే ఊహించారా? అన్న అనుమానం కలగకమానదు.

భార్య మరణం నుంచి తేరుకోలేకపోయారు:

భార్య మరణం నుంచి తేరుకోలేకపోయారు:

భార్య శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి తేరుకోలేకపోయారు. రాజకీయాలు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యాపకాలతో ఆయన ఆ బాధ నుంచి తేరుకుంటారని భావించినప్పటికీ.. అనుక్షణం ఆయన భార్య లేని లోటును అనుభవించారు. సన్నిహితులతో సైతం పలుమార్లు 'ఆమె ఫోటో పక్కన నేనెప్పుడు చేరుతానో' అంటూ ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.

ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా.. తల్లికి సంబంధించిన వీడియోలు చూస్తూ గడిపేవారని భూమా అఖిలప్రియ చెప్పారు. అమ్మ లేని లోటును నాన్న ఇంతలా అనుభవిస్తున్నారని తాము ఊహించలేదని ఆవేదన చెందారు.

మంత్రిపదవి కూడా కారణమే!:

మంత్రిపదవి కూడా కారణమే!:

తన ప్రత్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని తానే స్వయంగా గెలిపించాల్సి రావడం భూమా నాగిరెడ్డి రాజకీయ జీవితంలో విచిత్ర పరిస్థితి. ఒకవేళ శిల్పాచక్రపాణిరెడ్డి ఓడిపోతే.. ఒకే గూటిలో ఉండికూడా పార్టీ అభ్యర్థి గెలుపుకు సహకరించలేదన్న అపవాదు వెంటాడుతుందని భూమా మానసిక ఒత్తిడి గురైనట్లుగా చెబుతారు.

పైగా శిల్పాచక్రపాణి రెడ్డి ఓడిపోతే.. తనకు మంత్రి పదవి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నందునా.. ఆ బాధ్యతలను తన భుజానే వేసుకున్నారు. ఇదే విషయమై కడపకు చెందిన ఓ నేతను ఆదివారం నాడు కలవాలని భావించారు. ఇంతలోనే అకాల మృత్యువు ఆయన్ను వెంటాడింది.

నలుగురు సోదరుల్లో ముగ్గురు అలాగే!:

నలుగురు సోదరుల్లో ముగ్గురు అలాగే!:

భూమా నాగిరెడ్డికి మొత్తం నలుగురు సోదరులు కాగా అందులో భూమా నాగిరెడ్డి చిన్నవారు. అన్నదమ్ములు భూమా వీరప్రతాప రెడ్డి, వీరశేఖర్‌ రెడ్డి, భూమా వీరభాస్కర రెడ్డి, వీర నాగిరెడ్డిలలో.. వీర ప్రతాపరెడ్డి మినహా మిగిలినవారంతా గుండెపోటుతోనే మరణించారు. వీర శేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే హఠాన్మరణం చెందారు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి కూడా అదే తరహాలో చనిపోయపారు. ముగ్గురు సోదరులు 55ఏళ్ల వయసు లోపే చనిపోవడం గమనార్హం.

భూమలో మరో కోణం:

భూమలో మరో కోణం:

భూమా నాగిరెడ్డి నాయకుడిగా మాత్రమే కాదు, చదువుకునే రోజుల్లో మంచి క్రీడాకారుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రాథమిక విద్యను ఆళ్లగడ్డ, నంద్యాలలో పూర్తిచేసిన ఆయన, ఆ తర్వాత ఇంటర్ వరకు చెన్నైలోనే చదివారు.

చెన్నైలో చదువుకుంటున్న రోజుల్లో అండర్‌-19 తమిళనాడు రాష్ట్ర జట్టు బాస్కెట్‌బాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. క్రీడల మీద ఉన్న ఆసక్తే ఆ తర్వాత ఆయన్ను పలు క్రీడా కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనేలా చేసింది.

సోదరుల కుటుంబాలకు అండగా!:

సోదరుల కుటుంబాలకు అండగా!:

భూమా నాగిరెడ్డిది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబమే. సోదరులు చనిపోవడంతో వదినలు, వారి పిల్లల బాగోగులన్ని భూమా తన భుజాన వేసుకున్నారు. తన పిల్లలు, అన్న పిల్లలు.. ఇలా మొత్తం 12మందిని ఆయన చదివించారు. వారంతా ఇప్పటికీ భూమా నివాసంలో ఉంటారు.

వీరందరి ఖర్చు కోసం ప్రతీ నెలా భూమా నాగిరెడ్డి రూ.12లక్షల దాకా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+