విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి మ‌రో దెబ్బ‌..! మాజీ మంత్రి బాల‌రాజు ఔట్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/ఏపి : చంద్ర‌బాబు కాంగ్రెస్ తో దోస్తీ క‌ట్టిన ముహూర్తం ఏమంత బాగాలేద‌నిపిస్తోంది. ఢిల్టీలో రాహుల్ గాంధీతో చంద్ర‌బాబు నాయుడు క‌లిసిన ఘ‌డియ‌లు కూగా కాంగ్రెస్ పార్టీకి అంత‌గా క‌లిసి రావడం లేదు. ఏ సంద‌ర్బంలో చంద్ర‌బాబు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారో తెలియ‌దు గాని ఏపిలో కాంగ్రెస్ పార్టీ కుదుపుల‌కు లోనౌతోంది. ముందే మూలుగుతున్న న‌క్క మీద తాటికాయ ప‌డ్డ‌ట్టు ఢిల్లీలో కాంగ్రెస్ తో బాబు స్నేహం ఏపి కాంగ్రెస్ విచ్చిన్నానికి దారితీస్తోంది. ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. పార్టీ పై అస‌హ‌నంతో ఉన్న నేత‌లంద‌రూ జ‌న‌సేన పార్టీవైపు ప‌రుగులు పెట్ట‌డం కొస‌మురుపు..!

కాంగ్రెస్ పార్టీపైన జ‌న‌సేన ప్ర‌భావం..! ప‌వ‌న్ పార్టీలోకి క్యూ క‌డుతున్న నేత‌లు.!!

కాంగ్రెస్ పార్టీపైన జ‌న‌సేన ప్ర‌భావం..! ప‌వ‌న్ పార్టీలోకి క్యూ క‌డుతున్న నేత‌లు.!!

జనసేనాని పవన్ కల్యాణ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేనాని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందడుగు వేయ‌డ‌మే కాకుండా అస‌హ‌నంగా ఉన్న పార్టీ నేత‌ల‌ను ఆక‌ర్శించేప‌నిలో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఎక్కడ సభ పెట్టినా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు ప‌వ‌న్. గత ఎన్నికల్లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చిన జనసేన ఆ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.

 పార్టీ ప‌ట్ల అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు..!

పార్టీ ప‌ట్ల అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు..!

ప్ర‌త్యామ్నాయం వెతుక్కుంటున్న సీనియ‌ర్లు..!!
ఆ పార్టీ అధినేత పవన్. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే అభ్యర్ధుల గురించి కసరత్తులు మొదలుపెట్టారు జ‌న‌సేనాని. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయబోయే ఒక అభ్యర్థిని కూడా ప్రకటించేశాడు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం మీత దృష్టి పెట్టారు జనసేనాని పవన్ కల్యాణ్. ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న జనసేనాని.. అందుకోసం ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీ కండువా కప్పుకోగా, మరికొందరు వారి బాటలోనే పయనించడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ‌..! ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టు వ్వ‌వ‌హారం..!

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ‌..! ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టు వ్వ‌వ‌హారం..!

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ఆ పార్టీలోని కీలక నేతలందరూ వేరే పార్టీల్లోకి జంప్ అయ్యారు. కొంత మంది మాత్రం రాజకీయాల్లోనే లేకుండా పోయారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పార్టీకి దూరమైన నేతలందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది. ఈ ప‌రంప‌ర లోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

 కాంగ్రెస్ టీడిపి పొత్తు ప్ర‌భావం కూడా ఉంటుందంటున్న నాయ‌కులు..!

కాంగ్రెస్ టీడిపి పొత్తు ప్ర‌భావం కూడా ఉంటుందంటున్న నాయ‌కులు..!

అయితే, ఇటీవల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించే కొందరు నేతలు దూరమయ్యారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, వట్టి వసంతకుమార్, సీ రామచంద్రయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు వారి బాటలోనే మరో కీలక నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు చేరిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తన రాజీనామా లేఖ పంపించారు. ఆయన పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో శుక్రవారం జనసేనలో చేరారు. ఈయన చేరిక వెనుక నాదెండ్ల మనోహర్ చక్రం తిప్పినట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జీర్ణించుకోలేక నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
The Congress party is facing the worst situation in Andhra Pradesh. In the election after the split, the party did not get one seat in the AP. The key leaders of that party have jumped into other parties. Some people are left out of politics. However, recently the Congress party has been doing some corrective measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X