వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వివాదంలో కనకదుర్గ ఆలయం: అధికారుల తీరు వల్లే...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆలయ అధికారులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఏకపక్షంగా, ఆధిపత్య ధోరణితో వ్యవహరించి విమర్శల పాలవుతున్నారు.

తాజాగా ఫొటోల కాన్సెప్ట్ అంశంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశం కోర్టులో ఉండగానే అధికారులు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో గొడవకు పునాదులు పడ్డాయియ. దీనివల్ల దుర్గ గుడి అధికారుల తీరు మరోసారి వివాదంగా మారింది

కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా...

కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా...

కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అధికారులు వ్యవహరించారు. దీంతో వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దుర్గగుడిపై ఫొటోలు తీసేందుకు రెండేళ్ల క్రితం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకున్నారు.

రెండు పాయింట్లలో ఫొటోలు

రెండు పాయింట్లలో ఫొటోలు


వెంకటేశ్వర్లు రూ. 40 లక్షల రూపాయలు చెల్లించారు. తద్వారా రెండు పాయింట్లలో ఫొటోలుతీసుకుేందుకు కాంట్రాక్టు పొందారు. దుర్గగుడి ఘాట్ రోడ్డువైపు ఒక్క పాయంట్, రాజగోపురం వైపు మరో పాయింట్. ఈ రెండు పాయింట్లలో ఫొటోలు తీసుకునేందుకు అతనికి హక్కులు ఉన్నాయి.

Recommended Video

దుర్గ గుడిలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో !
అయితే ఇలా జరిగింది...

అయితే ఇలా జరిగింది...


ఘాట్ రోడ్డు వైపు పనులు జరుగుతుండడంతో ఇటీవల అటువైపు భక్తులను వెళ్లనీయడం లేదు. కేవలం రాజగోపురం వైపు మాత్రమే వెంకటేశ్వర్లు ఫొటోలు తీస్తున్నారు. ఇటీల కాంట్రాక్టు గడువు ముగిసింది. దీంతో ఖాళీ చేయాలని అతనికి అధికారులు నోటీసులు ఇచ్చారు.

దానిపై కోర్టుకెక్కిన వెంకటేశ్వర్లు...

దానిపై కోర్టుకెక్కిన వెంకటేశ్వర్లు...

అయితే, అధికారులు ఇచ్చిన నోటీసులపై వెంకటేశ్వర్లు కోర్టుకెక్కారు. ఘాట్ రోడ్డు పనుల కారణంగా తాను నష్టపోయానని, మరో ఏడాది కాంట్రాక్టు పొడిగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన హైకోర్టుకు విన్నవించుకున్నారు.దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వకూడదని, ఇచ్చినా అది చెల్లదని ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు ఆదేశాలతో అతను ఇలా...

కోర్టు ఆదేశాలతో అతను ఇలా...

కోర్టు ఆదేశాలు తనకు అనుకూలంగా ఉండడంతో వెంకటేశ్వర్లు ఫొటోలు తీయడం కొనసాగించారు. దాంతో కొంత మంది దుర్గ గుడి అధికారులు వెంకటేశ్వర్లు కెమెరాను, ల్యాప్‌టాప్‌ను లాక్కున్ారు. దాంతో అతను పోలీసులను ఆశ్రయించారు.

English summary
Another controversy erupted in Bezawada Kanaka durga temple due to the official attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X