ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతమనేని మరో వివాదం .. పోలీసుల గృహ నిర్బంధం .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇసుక కొరతపై టీడీపీ నిరసన ప్రదర్శనలు || Chintamaneni Was Take Into Custody By The police In Eluru

తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబుఇసుక కొరతపై ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఇక ఈ నేపధ్యంలో నేడు ఇసుక కొరత గురించి ,వైసీపీ పాలన గురించి ఆందోళన చెయ్యాలని భావించిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఏపీలో నెలకొన్న ఇసుక కొరత పై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఆదేశంతో ఆందోళనకు ఉపక్రమించిన మాజీ చింతమనేనిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు .

ముప్పై ఏళ్ళుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ గుప్పెట్లోకి ... ఎందుకంటేముప్పై ఏళ్ళుగా టీడీపీ చేతిలో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ గుప్పెట్లోకి ... ఎందుకంటే

ఇసుక ఇబ్బందులపై ఆందోళన ..చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్

ఇసుక ఇబ్బందులపై ఆందోళన ..చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్

ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఆందోళనలను భగ్నం చేసే క్రమంలో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్ళకుండా భారీగా మోహరించిన పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇసుక ఇబ్బందులపై చింతమనేని మాట్లాడుతూ, ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వైసీపీ అరాచకపాలనపై ఇక సమరమే అని ప్రకటించారు . ఇక ఆయన ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పిన నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను గృహనిర్బంధం చేశారు పోలీసులు .

'పోలీసులు గో బ్యాక్ అంటూ చింతమనేని ఇంటి వద్ద ఆందోళన

'పోలీసులు గో బ్యాక్ అంటూ చింతమనేని ఇంటి వద్ద ఆందోళన

ఈ సందర్భంగా, పోలీసులకు , చింతమనేని అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'పోలీసులు గో బ్యాక్' అంటూ నినదించారు. ఏది ఏమైనా మొదట నుండీ వివాదాస్పదుడైన చింతమనేని విషయంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసి ఆయన చెయ్య తలపెట్టిన ఆందోళనను అడ్డుకున్నారు. అయితే చింతమనేని ప్రభుత్వం కనీసం నిరసన కూడా తెలియజేయనీయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దళితులను తిట్టాడని చింతమేనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

దళితులను తిట్టాడని చింతమేనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఇక ఇదే సమయంలో తాజాగా చింతమేనేని పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని ,వారిని కులం పేరుతో దూషించారని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక ఇక్కడ దళితులు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు. చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ విచారణ చేపట్టారు. ఇక ఇదే సమయంలో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు కావటంతో స్థానికంగా ఇది హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Concerns raised by the state-wide TDP series on sand problems are continuing. On the other hand, in order to curb the agitations, the police have been lodging TDP leaders on the spot. Former TDP MLA Chintamaneni Prabhakar was house arrested by the police in Eluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X