వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైబర్ మోసాల జోరు.. వేల కోట్ల రుపాయల లాటరీ పేరుతో లక్షల దోపిడి...!

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరాల గూర్చి చెవుల్లో జోరీగలు మొత్తుకున్నట్టు, మొత్తుకుంటున్నా.. చాలమంది వాటి గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో సైబర్ నేరాగాళ్ల వలలో పడి లక్షల రుపాయాలను విదిలిస్తున్నారు. వందల కోట్ల రుపాయాలు ఉచితంగా ఎలా వస్తాయి అనే కనీస ఆలోచన లేకుండా సైబర్ ఉచ్చులో బిగుసుకుపోతున్నారు. తమ వద్ద నుండి తెలియకుండానే లక్షల రుపాయాలు దోచుకున్నాక, అప్పుడు తేరుకుంటున్నారు, అనంతరం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తాజాగా మరో సైబర్ మోసం విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. వైజాగ్‌లో బీ రామక్రిష్ణ అనే వ్యక్తికి వరల్డ్ లాటరీ ఆర్గనైజన్ నుండి మెయిల్ వచ్చింది. అందులో 2500 కోట్ల రుపాయల విలువగల బ్రిటన్ పౌండ్లు గెలుచుకున్నారంటూ మేయిల్‌‌‌లో పేర్కోన్నారు, అనంతరం ఓ వ్యక్తి చేసి రామక్రిష్ణకు ఫోన్ చేసి తాను యూకేలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాని, మీరు లాటనీ అమౌంట్ పోందాలంటే యూకేలో అకౌంట్ ఓపెన్ చేయాలని తెలిపారు.

Another cyber fraud has come to light in the Visakha district.

కాగా దీనికి సంబంధించి ఓ అకౌంట్ నంబరు ఇచ్చి అందులో ముందుగా 34వేల 500 రుపాయలు డిపాజిట్ చేయాలని చెప్పారు. దీంతో అధిక డబ్బుకోసం ఆశ పడిన రామక్రిష్ణ వారి ట్రాప్ పడి సుమారు 70 లక్షల రుపాయల వరకు సమర్పయామి చేసుకున్నాడు. ఇలా 70 లక్షల రుపాయాలు సైబర్ నేరాగాళ్లకు ముట్టచెప్పిన అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో అసలు విషయం తెలసుకున్న రామక్రిష్ణ మోసపోయానంటూ పోలీసులకు పిర్యాధు చేశాడు.

English summary
Another cyber fraud has come to light in the Visakha district. few days back a man Ramakrishna received mail from named by the World Lottery Organization. In the mail, it was claimed that he had won 2500 crores of rupees Britain lottery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X