• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నివర్ ప్రభావం తగ్గక ముందే దూసుకొస్తున్న ఇంకో తుఫాన్ ... అంతలోనే బురేవి కూడా ... ఏపీ అలెర్ట్

|

నివర్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లా లు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. నివర్ తుఫాను వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా దిశ మార్చుకుని సాగుతోంది . దీని ప్రభావం వల్ల ఇటు కోస్తా ఆంధ్రలోనూ, రాయలసీమ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా నివర్ ప్రభావం నుండి బయట పడక ముందే రాష్ట్రానికి మరో తుఫాను గండం పొంచి ఉంది. ఆ తుఫాను తగ్గకముందే బురేవి రానుంది. ఆపై టకేటి దాడి చెయ్యనుంది .

తుఫాన్ దెబ్బకు ఆగిన పెళ్లి ... వధూవరుల ఆశలపై నివర్ నీళ్ళు .. అసలేం జరిగిందంటేతుఫాన్ దెబ్బకు ఆగిన పెళ్లి ... వధూవరుల ఆశలపై నివర్ నీళ్ళు .. అసలేం జరిగిందంటే

 రేపు ఎపీకి మరో తుఫాన్ తాకిడి .. ఆపై బురేవి దెబ్బ కూడా ..

రేపు ఎపీకి మరో తుఫాన్ తాకిడి .. ఆపై బురేవి దెబ్బ కూడా ..

భూమధ్యరేఖకు సమీపంగా హిందూ మహాసముద్రానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చి 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 2వ తేదీన మరో తుఫాను బురేవి ఏపీ మీదకు దూసుకు వస్తున్నట్లుగా సమాచారం. బురేవి తుఫాను కూడా తీవ్రమైన ప్రభావం చూపనున్నట్టు గా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది .

వరుస తుఫాన్లతో అలెర్ట్ అయిన ఏపీ సర్కార్ .. నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే, వరదలపై సమీక్ష

వరుస తుఫాన్లతో అలెర్ట్ అయిన ఏపీ సర్కార్ .. నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే, వరదలపై సమీక్ష

వరుస తుఫాన్ల హెచ్చరికల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలర్ట్ అయింది. వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలతో ఏపీ సర్కార్ తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేకమైన దృష్టి సారించి అధికారులను అప్రమత్తం చేసింది.

సీఎం జగన్ నేడు నివర్ తుఫాను దెబ్బకు నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తున్నారు . చిత్తూరు , నెల్లూరు , కడప జిల్లాలలో ఏరియల్ సర్వే నిర్వహించి వరద నష్టాన్ని అంచనా వెయ్యనున్నారు. ఆపై రేణిగుంట విమానాశ్రయంలో మూడు జిల్లాల అధికారులతో వరద పరిస్థితి , కలిగిన నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు.డిసెంబర్ 15 లోపు నష్టాన్ని అంచనావేసి పరిహారం అందించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

  #AndhraPradesh : తుపాను ప్రభావిత ప్రాంతాలలో CM Jagan ఏరియల్‌ సర్వే.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా!
   ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్న వరుస తుఫాన్లు .. ప్రాణనష్టం కాకుండా జాగ్రత్తలు

  ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్న వరుస తుఫాన్లు .. ప్రాణనష్టం కాకుండా జాగ్రత్తలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా, వరుసగా ఏపీని చుట్టుముడుతున్న వర్షాలు ,వరదల కారణంగా, తుఫాన్ల ప్రభావం కారణంగా ఏపీ సతమతమవుతోంది. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ప్రకృతి వైపరీత్యాల నుండి వాటిల్లిన నష్టానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ విపత్తుల పరంపర కొనసాగుతుండడంతో సాధ్యమైనంత వరకూ ప్రాణనష్టం జరగకుండా చూడడానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.

  English summary
  The state of Andhra Pradesh is being hit hard by the impact of cyclone Nivar. Apart from Chittoor, Nellore, Kadapa, Prakasam and Kurnool districts, rains in several districts in Andhra Pradesh. Nivar is moving in a different direction from the meteorological department's expectations. Due to this, it is raining in coastal Andhra and Rayalaseema. Yet another storm looms over the state just before bed to get out of the Nivar effect. Burevi will come before the storm subsides. And then Taketi is going to attack
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X