వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏవోబీలో మళ్లీ ఉద్రిక్తత: ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి

|
Google Oneindia TeluguNews

మల్కాన్‌గిరి/విశాఖ: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం తెల్లవారుజామున మల్కాన్ గిరి సమీపంలో జంత్రి దగ్గర పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిసింది. కాగా, ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల నేపథ్యంలో మల్కాన్‌గిరి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎన్‌కౌంటర్ ఫొటోలు

సోమవారం ఎన్‌కౌంటర్ స్థలంలోనే మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, మావోల మృతిపై పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరుగుతున్నందున అక్కడికి వెళ్లలేకపోయామని చెబుతున్నారు.

కాగా, సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 24మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో 8మంది మహిళా మావోయిస్టులతోపాటు పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. మావో అగ్రనేత ఆర్కే తప్పించుకోగా ఆయన కుమారుడు మరణించాడు.

Another encounter in AOB

సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల్లో పోలీసులు 14 మందిని ప్రాధమికంగా గుర్తించారు. వీరి పూర్తి వివరాలతో పాటు మిగిలిన పది మంది వివరాలు మంగళవారం సాయంత్రం వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది.

1. చామళ్ల కిష్టయ్య అలియాస్‌ దయా, స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు (ఎస్‌జెడ్‌సీఎం), శ్రీకాకుళం-కొరాఫుట్‌ డీవీసీఎస్‌, స్వస్థలం- నల్గొండ, తెలంగాణ
2. బాకూరి వెంకటరమణ అలియాస్‌ గణేష్, స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు (ఎస్‌జెడ్‌సీఎం), స్వస్థలం-బాకూరి గ్రామం, విశాఖపట్నం
3. గెమ్మిలి కేశవరావు అలియాస్‌ బిరుసు, జిల్లా కమిటీ కార్యదర్శి (డీసీఎస్‌), ఫస్ట్‌ సీఆర్‌సీ, స్వస్థలం- తాడపాలెం గ్రామం, విశాఖపట్నం
4. జలుమూరి శ్రీనుబాబు అలియాస్‌ రైనో, జిల్లా కమిటీ సభ్యుడు (డీసీఎం), థర్డ్‌ సీఆర్‌సీ
5. ఇనపర్తి దాసు అలియాస్‌ మధు, జిల్లా కమిటీ సభ్యుడు (డీసీఎం), టెక్‌ టీం, స్వస్థలం-పశ్చిమగోదావరి
6. లత అలియాస్‌ పద్మ, (దుబాసి శంకర్‌ భార్య), జిల్లా కమిటీ సభ్యురాలు (డీసీఎం), స్వస్థలం- హైదరాబాద్‌
7. రాజేష్‌ అలియాస్‌ బిమల్‌, జిల్లా కమిటీ సభ్యుడు (డీసీఎం), ఫస్ట్‌ సీఆర్‌సీ, స్వస్థలం-ఛత్తీస్‌గఢ్‌
8. బోడు కుందనాలు అలియాస్‌ మమత (చెల్లూరి నారాయణరావు భార్య), జిల్లా కమిటీ సభ్యురాలు(డీసీఎం), స్వస్థలం- శ్రీకాకుళం
9. యామలాపల్లి సింహాచలం అలియాస్‌ మురళి, జిల్లా కమిటీ సభ్యుడు (డీసీఎం), స్వస్థలం-విజయనగరం
10. కామేశ్వరి అలియాస్‌ స్వరూప అలియాస్‌ రిక్కీ, జిల్లా కమిటీ సభ్యురాలు-(డీసీఎం), ఆర్టీసీ మాజీ కండక్టర్‌, స్వస్థలం-పశ్చిమగోదావరి జిల్లా
11. మున్నా, జిల్లా కమిటీ సభ్యుడు (డీసీఎం)- కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే కుమారుడు
12. శ్వేత, ఏరియా కమిటీ సభ్యురాలు (ఏసీఎం), పెదబయలు ఏరియా కమిటీ.
13. బుద్రి, ఏరియా కమిటీ సభ్యురాలు (ఏసీఎం), కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే రక్షక బృందం సభ్యురాలు, ఛత్తీస్‌గఢ్‌
14. మురాయ్‌, ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎం), ఛత్తీస్‌గఢ్‌

English summary
Another encounter in AOB, three maoists killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X