వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Congress కు మరో షాక్... అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అంపశయ్య మీద ఉన్న పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలాతిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ .. ఈ రోజు జగన్ షెడ్యూల్ ఇలా

జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా

జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సైతం రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగలేనని భీష్మించుకుని కూర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధులు బతిమిలాడుతున్న కనీసం కనికరించడం లేదు. గాంధీ-నెహ్రూ కుటుంబాలు కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్తున్నారు. రాహుల్ గాంధీని రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని సీడబ్ల్యూసీ కోరుతున్నా ఆయన మాత్రం వెనక్కితగ్గడం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ రాజీనామా ఆమోదమైతే దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు మాజీలు అవుతారు.

నోటా కన్నా తక్కువ ఓట్లు .. దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి

నోటా కన్నా తక్కువ ఓట్లు .. దిగజారిన కాంగ్రెస్ పరిస్థితి

ఏపీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, పరిస్థితి మరింత దిగజారిపోయింది. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి.కాంగ్రెసుకు మాత్రం 1.29 శాతం ఓట్లు వచ్చాయి.రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు పడగా, కాంగ్రెసుకు 1.17 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్ కన్నా నోటా బెటర్ అన్న భావన ఏపీలో ఉంది అని అర్ధం అవుతుంది.

 నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన రఘువీరా రెడ్డి

నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన రఘువీరా రెడ్డి

ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లోకసభ, శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. అయితే, 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు 2.8 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అంత కంటే తక్కువ వచ్చాయి . దీంతో కాంగ్రెసు పరిస్థితి నానాటికీ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే నైతిక బాధ్యత వహిస్తూ రఘువీర రాజీనామా చేశారు. రఘువీరారెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

English summary
PCC President Raghuveera Reddy has resigned to his Position. Raghuveera has taken this decision following Congress’ severe drubbing in the elections in which the grand-old party did not even open its account. It is said that Raghuveera sent his resignation to Congress President Rahul Gandhi immediately after the polling on April 11th. That means the result is very much expected. Congress high command is yet to take a decision on it. Congress managed a mere 1.17% Vote Share in the election. The Vote Share of Congress is slightly better than that of BJP’s (0.84%) and way less than what NOTA received (1.28%). Raghuveera Reddy himself lost his deposit from Kalyanadurgam even though he got votes better than any other Congress candidate across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X