వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ కు మరో షాక్ .. ప్రత్యేక హోదాకే కాదు పన్ను రాయితీలకు మొండిచెయ్యి చూపిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆంధ్రప్రదేశ్ పన్ను రాయితీలు కూడా ఇవ్వలేమన్న గడ్కరీ|Central GOVT Not Giving Any Tax Exemptions For AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోమారు కేంద్రం మొండిచేయి చూపింది.ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత లోటు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన కేంద్ర సర్కార్ మాట తప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంది. మొన్నటికి మొన్న పార్లమెంట్ వేదికగా ప్రత్యేకహోదా ఒక ముగిసిన అధ్యాయమని , హోదా ఇచ్చేది లేదని లిఖిత పూర్వకంగా ఇచ్చింది.ఇక తాజాగా మరో ప్రకటన చేసి ఝలక్ ఇచ్చింది.

మద్యంపై పొంతన లేని స్టేట్మెంట్లు .. వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ అంటున్న లోకేష్ మద్యంపై పొంతన లేని స్టేట్మెంట్లు .. వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ అంటున్న లోకేష్

 ప్రత్యేక హోదా రాదు.. రాష్ట్రానికి ప్రత్యేక పన్ను రాయితీలు సాధ్యం కావు అన్న కేంద్రం

ప్రత్యేక హోదా రాదు.. రాష్ట్రానికి ప్రత్యేక పన్ను రాయితీలు సాధ్యం కావు అన్న కేంద్రం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై మొండిచెయ్యి చూపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో పుట్టెడు కష్టాల్లో ఉన్న ఏపీని ఆదుకోవడానికి కనీసం ప్రత్యేకంగా పన్ను రాయితీలు అయినా ఇవ్వాలని కోరారు వైసిపి లోక్సభ సభ్యులు అవినాష్ రెడ్డి. ఇక ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను రాయితీలు అమలు చేస్తే, మిగతా రాష్ట్రాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుందని నితిన్ గడ్కరి పేర్కొన్నారు. ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేమని , ఒకవేళ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుందని గడ్కరీ స్పష్టం చేశారు.

 ప్రభుత్వం సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల మీద ప్రోత్సహకాలు ఇస్తామన్న గడ్కరీ

ప్రభుత్వం సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల మీద ప్రోత్సహకాలు ఇస్తామన్న గడ్కరీ

వైసీపీ లోక్ సభ సభ్యుడు అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దీంతో కనీసం పన్ను విషయంలో ప్రత్యేక రాయితీలు అయినా ఇస్తారని భావిస్తే అవి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పి ఏపీ ఆశల మీద నీళ్లు చల్లారు . ఇక అదే సమయంలో విశాఖపట్నంలో ఈరోజు నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పనిచేస్తోందని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమల మీద ప్రోత్సహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఒక పక్క ఏపీలో పరిశ్రమలు పట్టటానికి కంపెనీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు రావటం లేదు .

జగన్ సర్కార్ కు షాక్ ... ఏ విధంగానూ ఏపీని ఆదుకోని కేంద్రం

జగన్ సర్కార్ కు షాక్ ... ఏ విధంగానూ ఏపీని ఆదుకోని కేంద్రం

మొత్తానికి విభజన సమయంలో ఏపీకి రావలసిన నిధులు ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. కనీసం పన్ను పై ప్రత్యేక రాయితీలను ఇస్తారంటే అది కూడా లేదని తేల్చేశారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రత్యేక హోదా కూడా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మరి ఇలాంటి సమయంలో ఆర్థిక లోటు తో ఇబ్బందిపడుతున్న జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో అన్నది ఆసక్తి కలిగించే అంశంగా మారింది.

English summary
YSRCP Lok Sabha member Avinash Reddy said that the central government, which has shown its stubbornness to Andhra Pradesh, has now asked for at least a special tax concession to help the AP, which was born with financial difficulties. Responding to his question, the central government has ruled that it is not possible to give special tax concessions to Andhra Pradesh.Nitin Gadkari said the tax exemptions would be objected to by the rest of the state, especially in Andhra Pradesh. Minister of State for Micro and Small Industries Nitin Gadkari said the subsidies were not implemented in a single state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X