• search
 • Live TV
ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కొత్త సంవత్సరంలో మరో అడుగు .. ఏపీలో ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ ... ఎక్కడి నుంచి శ్రీకారం అంటే

|

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వైద్య శాఖను ప్రక్షాళన చెయ్యాలని, సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలని భావించిన ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక తాజాగా 2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు రేపటి నుండి పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనుంది.

  AP Govt Identified Nearly 21.58 Lac People ineligible govt welfare schemes benefits

  మరో హామీ నెరవేర్చే పనిలో జగన్: సమగ్ర భూముల రీసర్వేకు ఏపీ సర్కార్ శ్రీకారం

   ప్రజల ఆరోగ్య రక్షణకు సీఎం జగన్ ముందడుగు

  ప్రజల ఆరోగ్య రక్షణకు సీఎం జగన్ ముందడుగు

  జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా, కిడ్నీ సమస్యలు ఉన్న డయాలసిస్ రోగులకు రూ.10వేల పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే .బోదకాలు, వీల్ ఛైర్లకు పరిమితమైన బాధితులకు,తీవ్ర పక్షవాతంతో బాధపడేవారికి జనవరి నుంచి పెన్షన్లు ఇస్తామని పేర్కొన్న జగన్ రేపు ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు

  జనవరి 3న ఏలూరు వేదికగా ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం

  జనవరి 3న ఏలూరు వేదికగా ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం

  జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వేదికగా ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ ను లాంచనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 1,059 వ్యాధులకు వైద్య సేవలు అందుతున్నాయి. అదనంగా మరో వెయ్యి వ్యాధులకు వైద్య సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్ . దీంట్లో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు . అందులో భాగంగానే పైలెట్‌ ప్రాజెక్టు‌ను ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

   2059 వ్యాధులకు చికిత్స ..ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ

  2059 వ్యాధులకు చికిత్స ..ఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ

  ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా మొత్తం 2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలుతో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి సర్కార్ వాటిని అధిగమించి మిగతా అన్ని జిల్లాలలోనూ ఏప్రిల్‌ నుంచి అమలు చెయ్యాలని భావిస్తోంది. ఇక ఈ నేపధ్యంలో వైద్య శాఖాధికారులతో మంత్రి ఆళ్ళ నానీ సమీక్ష నిర్వహించారు. రేపు సీఎం జగన్ ఏలూరు పర్యటన సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

  ప్రభుత్వానికి ఆర్ధిక భారం...అయినా సరే ఆరోగ్య శ్రీ పథకం

  ప్రభుత్వానికి ఆర్ధిక భారం...అయినా సరే ఆరోగ్య శ్రీ పథకం

  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే ఈ స్కీం కోసం ఆరోగ్య లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే.. వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను కూడా పొందుపరచాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యరక్షణే ప్రధమ కర్తవ్యం అని భావించి సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరుగుతున్నా సరే అమలు చేసి తీరతామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం .

  English summary
  CM Jagan Mohan Reddy will launch the 'arogya Sri Pilot Project' on January 3 at Eluru platform in West Godavari district. Currently, 1,059 diseases treatments are being provided by the health department. In addition to this, YCP government has decided to provide medical services for another thousand diseases .The government is preparing to treat 2059 diseases through this experimental project.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more