వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీకి మరో నేత రాం రాం..! కాషాయం కండువా కప్పుకోనున్న జూపూడి..?

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఎపి లో రాజకీయ నేతల తీరు రంజుగా ఉన్నట్టు తెలుస్తోంది. నైతిక విలువల కన్నా రాజకీయ పదవులే మిన్న అంటున్నారు ఏపి నేతలు. టీడిపి ఒటమితో చాలా మంది పదవులు అనుభవించిన నేతలు ఆ పార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు అదే దారిలో మరో కీలక నేత తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నట్టు వార్తలు ఘుప్పుమంటున్నాయి. బెల్లం చుట్టూ ఈగలు అన్న చందంగా ఏపీలో సరిగ్గా ఇప్పుడు ఇదే జరుగుతోంది. టీడీపీ గద్దె దిగిపోగానే, అందులో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంపయ్యారు. చంద్రబాబుకు అత్యంత అనుంగులు, ఆర్థిక అండదండలిచ్చినవారే ఆ పార్టీని వదిలేశారు. తాజాగా, టీడీపీలో సీనియర్ దళిత నేత కూడా బీజేపీలోకి ఎగిరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు..

Recommended Video

తెరపడని కేశినేని, బుద్ధా వెంకన్న ట్విట్టర్ వార్
Another tdp leader Jumping into bjp.! Jupudy with a saffron scarf..?

ఏపీలో 'ఆపరేషన్ ఆకర్ష్' పేరిట చెలరేగిపోతున్న బీజేపీకి దళిత నేతల కొరత తీవ్రంగా ఉంది. అందుకే, ఆ కోటాలో ఏదైనా నామినేటెడ్ పోస్టు కొట్టేయడానికి సిద్ధమయ్యారు ఆ దళిత నేత. ఇంతకీ ఆయనెవరో చెప్పలేదు కదూ... ఆయనే జూపూడి ప్రభాకర్ రావు. మంచి వాగ్ధాటి గల ఈయనను నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వెలుగులోకి వచ్చారు. ఆ తరువాత, ఏపీ కాంగ్రెస్ కనుమరుగవడంతో, 2014లో వైసీపీలో చేరారు. కొండపి నుంచి ఎన్నికల్లో పోటీకి దిగి ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో జూపూడీ ఫ్లేట్ ఫిరాయించారు. వెంటనే చంద్రబాబును ప్రసన్నం చేసుకుని టీడీపీలో చేరారు. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జూపూడి ఆలోచనలో పడ్డారు. పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీలోకి వెళ్లలేరు. టీడీపీలో కొనసాగలేరు. ఇక ఉన్నదల్లా ఒక్క బీజేపీ మాత్రమే. అందుకే, బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తోంది.

English summary
Jupudi was concerned about the loss of TDP in the 2019 elections and the lack of a recovery. Looking at the side glances. Can't go into YCP. Can't continue on TDP. Everything else is only one BJP. Therefore, it is through his close friends that he is preparing to join the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X