గౌతమి మృతిలో మరో కోణం: టోనీ ఎవరు, నోరు విప్పని పావని
గౌతమి మృతి కేసులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఆ కేసులో వినిపిస్తున్న టోనీ అనే పేరు గల వ్యక్తి ఎవరనేది తేలడం లేదు.
ఏలూరు: గౌతమి మృతి కేసులో మరో కోణం వెలుగు చూసింది. ఈ కేసులో వినిపిస్తున్న టోనీ పేరు గల వ్యక్తి ఎవరనే చర్చ సాగుతోంది. నరసాపురంలో అతనెవరనే విషయంపైనే చర్చ సాగుతోంది. గౌతమిది హత్య కాదని, ఆమె రోడ్డు ప్రమాదంలోనే మరణించిందని పోలీసులు అధికారులు తేల్చేశారు. అయితే, సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
సంచలనం సృష్టించిన గౌతమి రోడ్డు ప్రమాదం కేసును విచారణాధికారి రత్నం తేల్చేశారు. రత్నం చెప్పిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ నరసాపురానికి చెందిన టోనీ దగ్గరకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందన్న విషయం వెలుగు చూదడంతో అందరు టోనీ గురించి అరా తీశారు. అతని వివరాలు, నివాసాన్ని తెలపని పోలీసులు ఫొన నెంబర్‌తో సరిపెట్టారు.

దీంతో టోనీ ఎవరంటూ ఇటు మొగల్తూరు, అటు నరసాపురం మండలం సీతారాంపురం గ్రామస్థుల్ని అరా తీశారు. అయితే టోనీ ఎవరన్నది తెలియరాలేదు. 18న నరసాపురం మీదుగానే కారు రాకపోకలు సాగించడంతో ఆ రోజున కారును ఎవరైన చూశారా అనే చర్చ సాగుతోంది.
గౌతమిది హత్య కాదు ప్రమాదమేనని పోలీసులు తేల్చడంతో శుక్రవారం ఆమె సోదరి పావని ఏం మాట్లాడుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశా రు. ఇటు పోలీసులు కూడా పలుమార్లు పావని ఏమైనా మాట్లాడిందా అంటూ ఆరా తీశారని చెబుతున్నారు.
కాగా ప్రమాదంలో గాయపడినన శుక్రవారం కూడా పలువురు పరామర్శించారు. ఎమ్మెల్సీ శేషుబాబుతోపాటు ఎస్‌ఎఫ్ఐ నాయకులు పావని కలిశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ శేషుబాబు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications