అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో వికెట్, జగన్‌కు గుర్నాథ్‌రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నా

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP Gurunath Reddy To Join TDP, Here Are The Reasons

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

గుర్నాథ్ రెడ్డి గురువారం లేదా శుక్రవారం రాజధాని అమరావతి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. గుర్నాథ్ రెడ్డి చేరుతారని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలో బెంగ పట్టుకుంది. దీంతో ఆయన హడావుడిగా సీఎం చంద్రబాబును కలిశారు.

ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు, ఇప్పుడు దెబ్బతీద్దాం!: జగన్‌పై బాబు పక్కా ప్లాన్ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు, ఇప్పుడు దెబ్బతీద్దాం!: జగన్‌పై బాబు పక్కా ప్లాన్

 చంద్రబాబు ఎదుట ప్రభాకర్ చౌదరి ఆందోళన

చంద్రబాబు ఎదుట ప్రభాకర్ చౌదరి ఆందోళన

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన ఆందోళన ఆయన ముందు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మొదలు, గుర్నాథ్ రెడ్డి పార్టీలో ఎందుకు చేరుతున్నారో అధినేతకు పూసగుచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు కూడా ఆయన మాటలను సావధానంగా విన్నారు. నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభయం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 గుర్నాథ్ రెడ్డి రాకకు కారణాలు ఇవే

గుర్నాథ్ రెడ్డి రాకకు కారణాలు ఇవే

గుర్నాథ్ రెడ్డి చేరికపై చంద్రబాబును అడగగా.. పార్టీ బలోపేతం కోసమే ఆయనను తీసుకుంటున్నట్లుగా ప్రభాకర్ చౌదరికి తెలిపారు. 2019 నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అయితే గుర్నాథ్ రెడ్డి రాక వెనుక పలు కారణాలు ఉన్నాయని ప్రభాకర్ చౌదరి తెలిపారు.

 మిస్సమ్మ బంగ్లా, వ్యాపారాలు

మిస్సమ్మ బంగ్లా, వ్యాపారాలు

ఆయన టీడీపీ కోసం కాకుండా వ్యాపారాల కోసమే మన పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబుతో ప్రభాకర్ చౌదరి తెలిపారు. బిజినెస్ కోసం వస్తున్న వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. దీంతో పాటు మిస్సమ్మ బంగ్లా కోసమే ఆయన టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోందని తెలిపారు.

అంతలేదని చంద్రబాబు!

అంతలేదని చంద్రబాబు!

దీనిపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో వ్యాపార ధోరణిని కంట్రోల్ చేస్తామని వెల్లడించారు. అలాగే గుర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరినప్పటికీ మిస్సమ్మ బంగ్లా విషయంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని తెలిపారు. ఈ బంగ్లా విషయంలో ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండదని తెలిపారు.

 గుర్నాథ్ రెడ్డి వచ్చినా మీ నాయకత్వంలోనే పని చేయాలి

గుర్నాథ్ రెడ్డి వచ్చినా మీ నాయకత్వంలోనే పని చేయాలి

గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరినా మీ నాయకత్వంలోనే పని చేయాలని ప్రభాకర్ చౌదరితో చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ విషయంలో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. పార్టీ ప్రయోజనాల కోసమైతే గుర్నాథ్ రెడ్డి వస్తే ఇబ్బంది లేదని చెప్పారు.

ఏం జరుగుతుందోనని ప్రభాకర్ చౌదరి ఆవేదన

ఏం జరుగుతుందోనని ప్రభాకర్ చౌదరి ఆవేదన

ఇప్పటికే, జేసీ దివాకర్ రెడ్డిపై ప్రభాకర్ చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలోని నేత, తనపై గతంలో పోటీ చేసిన వైసిపి నాయకుడు రావడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికి హామీ ఇచ్చినప్పటికి భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన ప్రభాకర్ చౌదరిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. గుర్నాథ్ రెడ్డి వెనుక జెసి దివాకర్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం సాగింది.

English summary
Another YSR Congress Party leader Gurunath Reddy to join Telugu Desam soon. MLA Prabhaka Reddy on Wednesday met AP CM and TDP president Nara Chandrababu Naidu.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డి రేపో మాపో టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X