వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామపై అనర్హత వేటు వేయండి: యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం చర్యలు..?, స్పీకర్‌ను కోరిన వైసీపీ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణంరాజుపై యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎంపీల ప్రతినిధి బృందం స్పీకర్ ఓం బిర్లాను కోరింది. ఈ మేరకు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చామని విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు. రఘురామ వ్యవహారశైలిని పరిగణలోకి తీసుకుని యాంటీ డిఫెక్షన్ లా ప్రోవిజన్స్ ప్రకారం చర్య తీసుకోవాలి కోరామన్నారు. వాలంటరీ గివింగ్‌ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ను వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. తమ పిటిషన్ స్వీకరించిన స్పీకర్ ఓం బిర్లా.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు.

టికెట్ ఇచ్చిన పార్టీని కాదని..

టికెట్ ఇచ్చిన పార్టీని కాదని..

పార్టీ రాజకీయ విధానాన్ని, ప్రజాస్వామిక మూలాలను కదిలించే విధంగా రఘురామ వ్యవహరించారని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏ పార్టీ టిక్కెట్, ఏ పార్టీ మేనిఫెస్టో, ఏ పార్టీ గుర్తుతో గెలిచారో అ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం దారుణమన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీలో ఉంటూ ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రఘురామపై అనర్హత వేటు వేయడానికి ఇంతకుమించి కారణాలు ఏముంటాయని ప్రశ్నించారు. పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్‌ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ రఘురామ వర్తిస్తుందన్నారు. పార్టీపై వ్యతిరేకతతో, క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారని తెలిపారు. త్వరలో అతనిపై అనర్హత వేటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో తన బొమ్మతో రఘురామ పోటీ చేసి సత్తా ఏమిటో నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

అనర్హత వేటు..?

అనర్హత వేటు..?

వైసీపీ పార్టీని దూషిస్తోన్న రఘురామకృష్ణంరాజును ఉపేక్షించేది లేదని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కన్నతల్లిలాంటి పార్టీకి ఆయన ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. పార్టీ విధానాలు నచ్చకుంటే రాజీనామా చేయాలే తప్ప..బాహాటంగా విమర్శించొద్దు అని హితవు పలికారు. రఘురామ ఇప్పటికే మూడు పార్టీలు మారాడని, ఇప్పుడు వెళ్లబోయే పార్టీలో అయినా వుంటారా అనేది అనుమానమేనన్నారు.

ఏం చేయలేక..?

ఏం చేయలేక..?

పార్టీ హైకమాండ్‌తో గొడవ పెట్టుకొని, తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేని స్థితిలో రఘురామకృష్ణంరాజు ఉన్నారని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. గొడవలతో సాధించింది ఏమిటో ప్రశ్నించుకోవాలని సూచించారు. పార్టీలో ఉండలేకపోతే పార్టీ వీడి, తిరిగి పోటీ చేసి గెలవాలని సూచించారు. గతంలో జగన్ అలానే చేశారని గుర్తుచేశారు. పార్టీ విధానాల పట్ల అభ్యంతరాలుంటే, అధినాయకత్వం వద్ద చర్చించాలే తప్ప.. బహిరంగ వేదికలపై కాదన్నారు. మీడియాతో ఎలా మాట్లాడాతారు అని ప్రశ్నించారు.

పార్టీలతో కుమ్మక్కు

పార్టీలతో కుమ్మక్కు

రఘురామపై ఉన్న కేసులతో, ఇతర పార్టీతో కుమ్మక్కై ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీ అంటే తల్లి లాంటిదని, కానీ పార్టీపై, అధినేతపై విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పదో షెడ్యూల్ ప్రకారం వాలంటరీ గివింగ్‌అప్‌ ఆఫ్‌ మెంబర్‌షిప్‌ కింద కూడా రఘురామకృష్ణంరాజుపై చర్య తీసుకోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో అనర్హత వేటుపై మూడు నెలల్లో చర్య తీసుకోవాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం లోక్‌సభ స్పీకర్ కూడా తాము ఇచ్చిన పిటీషన్ పై మూడునెలల్లో చర్యలు తీసుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

పైకి ఇలా... లోన అలా...?

పైకి ఇలా... లోన అలా...?

రఘురామకృష్ణంరాజుకి సీఎం జగన్ మంచి ప్రాధాన్యత ఇచ్చారని లోక్‌సభాపక్షనేతపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ ఆయన కోరిన వెంటనే పార్లమెంట్ కమిటీల్లో చైర్మన్ పదవీకి అంగీకారం తెలిపారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాన్ని ఇప్పుడు వివాదం చేయడం మంచి పద్ధతి కాదని.. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వంపై బుదరజల్లే ప్రయత్నమేనని ఆరోపించారు. ఎంపీగా ఆయనకు అభ్యంతరాలు ఉంటే.. టీటీడీ చైర్మన్, అధికారులతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో బీజేపీ, టీడీపీ కలిసి తీసుకున్న నిర్ణయాలను అప్పుడు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. పైకి జగన్ మంచివారు అంటూ, పార్టీని నష్టపరిచేలా బహిరంగంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. టీడీపీ అంటే తెలుగుదేశం, బీజేపీ అంటే భారతీయ జనతాపార్టీ అని వైఎస్ఆర్ సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే విషయం అందరికీ తెలుసున్నారు. దీనిని వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

Recommended Video

YS Jagan Inaugurates New Ambulance Services In AP | 104,108 సేవ‌లలో కొత్త శ‌కం || Oneindia Telugu
అలా ఏం లేదు

అలా ఏం లేదు


లోక్‌సభ స్పీకర్ ను కలిసి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరామని చీఫ్ విప్ మార్గాని భరత్ తెలిపారు. పార్టీ నుంచి స్పీకర్‌కు ఇచ్చిన లేఖ ఆధారంగా సబార్డినేట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రఘురామ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. జగన్ టిక్కెట్టు ఇచ్చినందునే గెలిచారన్నారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరని స్పష్టం చేశారు.

English summary
anti-defection law provisions take action to raghurama ysrcp mps ask speaker om birla
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X