వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య కేసు: చంద్రభాన్ గడ్డం పెంచాడు, జ్యోతిష్కుడి వద్దకు వెళ్లాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రభాన్ సుదమ్ సనప్ నేరం చేసిన తర్వాత తీవ్రమైన భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. తాను ఓ అమ్మాయిని చంపాననే పాపభీతి చంద్రభాన్‌ను వెంటాడింది. అందుకే హత్య చేసిన జనవరి 5వతేదీనే విషయాన్ని అతడి అమ్మకు, మోటార్‌సైకిల్ యజమాని అయిన తన స్నేహితుడికి చెప్పేశాడు.

తల్లితో కలిసి స్థానికంగా ఉండే జోతిష్యుడి వద్దకు కూడా వెళ్లాడు. ఓ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డానని, పాప పరిహారానికి ఏమైనా పూజలు ఉన్నాయా? అని అడిగాడు. ఎవరైనా స్వామీజీల వద్దకు వెళ్తే చెప్పగలరని ఆ జోతిష్యుడు చెప్పాడు. అతడికి చెడ్డ రోజులు వచ్చాయని, కాలసర్ప దోషం ఉందని, త్రయంబకేశ్వర్‌లో పూజులు చేయాలని చెప్పాడు. జ్యోతిష్కుడు చెప్పినట్లు చేసినా చంద్రభాన్ తప్పించుకోలేకోపయాడు.

Anuhya case: Chandrabhan went to astrologer

అతను గడ్డం పెంచుకుని గుర్తు పట్టరాకుండా నాసిక్‌లో తిరిగే ప్రయత్నం చేశాడు. నుదుట బొట్టు పెట్టుకోవడం, తెల్ల దుస్తులు ధరించడం ప్రారంభించాడు. సిసిటీవీ ఫుటేజీలో అనూహ్య పక్కన ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నించారు. అతన్ని చంద్రభాన్ సుదమ్ సనప్‌గా గుర్తించిన పోలీసులు అతనిపై గామ్‌దేవి, నాసిక్, మన్మాడ్, ఇటార్సీల్లో ఎనిమిది చోరీ కేసులు ఉన్నట్లు తెలిసింది.

ఆ తర్వాత ఇంటినుంచి వెళ్లిపోయిన చంద్రభాన్ నాసిక్‌లో మారువేషంలో సంచరించాడు. ఈ విషయాన్ని చంద్రభాన్ తరఫు న్యాయవాది ప్రకాశ్ సల్సింగికర్ కోర్టుకు వివరిస్తూ - చేసిన తప్పుకు చంద్రబాబు పశ్చాత్తాపం చెందాడని, అందువల్లనే జోతిష్యుడిని ఆశ్రయించాడని చెప్పారు. మార్పు కోరుకుంటున్న వ్యక్తికి ఉరిశిక్ష విధించవద్దని విన్నవించారు.

Anuhya case: Chandrabhan went to astrologer

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజాఠాక్రే వాదనలు వినిపిస్తూ - ఓ యువతి ఉద్యోగం కోసం ముంబై వచ్చి హత్యకు గురైంది. చేతి వేలికున్న ఉంగరాన్ని చూసి కూతురి శవాన్ని చూసి గుర్తుపట్టాల్సి వస్తే ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్న ఓ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన హంతకుడికి ఉరిశిక్ష మినహా మరే శిక్ష విధించినా సమాజంలో అభద్రతాభావం నెలకొంటుంది అని వాదించారు.

సనప్ అరెస్టుకు ముందు సేకరించిన ఆధారాలు

Anuhya case: Chandrabhan went to astrologer

అనూహ్య ఎక్కిన రైలు రావడానికి 30 నిమిషాల ముందు లోకమాన్య తిలక్ టెర్మినస్ సమీపంలో చంద్రభాన్ సనప్ మద్యం తాగినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. రైల్వే సిబ్బంది సహా చంద్రభాన్‌తో మాట్లాడిన అందరి వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. అనూహ్యను చంద్రభాన్ తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డయినా అది స్పష్టంగా లేదు.

అనూహ్య కేసులో పోలీసులు ముంబైలోని అనేకమంది టాక్సీ, ఆటో డ్రైవర్లను ప్రశ్నించారు. చాయ్‌వాలాలను అడిగి వివరాలు సేకరించారు. మొత్తంగా ఈ కేసులో 2500మందిని పోలీసులు ప్రశ్నించడంతోపాటు 36 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.

English summary
After killing Machilipatnam software engineer Anuhya, ChandraBhan Sudam Sanap escaped to Nasik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X