వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య కేసు: అతనే చెప్పకపోతే చంద్రభాను దొరికేవాడు కాదా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మచిలీపట్నం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య రేప్, హత్య కేసును ఛేదించడం ముంబై పోలీసులకు గగనంగానే మారింది. ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నారు. అతనికి కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారంనాడు తీర్పు చెప్పింది. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినల్‌లోని ఓ పోర్టర్ ఇచ్చిన సమాచారమే పోలీసులకు హంతుకుడిని పట్టుకోవడంలో కీలకంగా మారింది.

హంతకుడు చంద్రభాను ఓ రైల్వే కూలీ కుమారుడు. తండ్రి మరణం తర్వాత అతని లైసెన్సును తన పేరు మీదికి మార్చుకుని కొంత కాలం రైల్వే కూలీగా పనిచేశాడు. ఆ తర్వాత కాల్ సెంటర్లకు కొంత కాలం క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశాడు. అనూహ్యను హత్య చేసిన తర్వాత అతను మూడో భార్య ఉంటున్న నాసిక్‌కు మార్చాడు. అక్కడే అతను ట్రాన్స్‌పోర్ట్స్ డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాుడ

ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్‌లోని ఓ పోర్టర్ చెప్పిన వివరాలతో పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య హత్య కేసు మిస్టరీని ఛేదించారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన సందర్బంలో ఆ పోర్టర్ నిందితుడిని గుర్తించినట్లు చెబుతున్నారు. పోలీసులు విచారణలో ప్రమోద్ తోమ్రే అనే పోర్టర్ నిందితుడిని గుర్తించాడు.

Anuhya case: who is Chandra Bhanu Sanap?

దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు వంద మంది పోర్టర్లను, చిరు వ్యాపారులను పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులకు ఉన్న ఒకే ఒక ఆధారం సిసిటీవి ఫుటేజీ నుంచి పొందిన చిత్రం. అనూహ్య సంచీని పట్టుకుని ఆమె ముందు నడుస్తున్న మీసాలు గల వ్యక్తి ఆ చిత్రంలో కనిపించాడు. దాని ఆధారంగానే పోలీసులు కేసును ఛేదించాల్సి వచ్చింది. పామ్యాగా కూడా పేరున్న తోమ్రే ఆ వ్యక్తిని చంద్రకాంత్ సనప్‌గా గుర్తించాడు. చంద్రకాంత్ సనప్ గతంలో పోర్టర్‌గా పనిచేయడం వల్ల అతను గుర్తించగలిగాడు.

ఆరేళ్ల క్రితం అతను తమతో కలిసి పనిచేశాడని, అందుకే చూడగానే అతన్ని గుర్తించానని పామ్యా మిడ్డేకు అప్పట్లో ప్రత్యేకంగా చెప్పాడు. అంతేకాకుండా పామ్యా చంద్రకాంత్ ఎక్కడున్నాడనే విషయాన్ని కూడా అతను కనిపెట్టాడు. ఈ విషయాన్ని పామ్యా మిడ్డేతో ప్రత్యేకంగా పంచుకున్నాడు. అతన్ని పామ్యా గుర్తించినప్పటికీ పోలీసులు అతని జాడను కనిపెట్టలేకపోయారు. అతని గురించిన సమాచారాన్ని తాను సేకరించానని, దాంతో అతని స్వస్థలం నాసిక్ అని తెలిసిందని పామ్యా చెప్పాడు. సనప్‌ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందానికి తాను సమాచారం అందించానని చెప్పాడు.

సనప్‌ను కుర్లా పోలీసులు తొలుత పట్టుకున్నారని, అయితే కాల్ డిటేల్ రికార్డులు లేకపోవడంతో వదిలేశారని పోలీసులు చెప్పారు. అతని కాల్ రికార్డులను ఇవ్వాలని కుంజుర్‌మార్గ్ పోలీసులను అడిగామని, వారు వెంటనే సమాచారం ఇవ్వకపోవడంతో అతన్ని వదిలేశామని చెప్పారు. అయితే తమ ముందు ప్రతి రోజూ హాజరు కావాలని అతన్ని అడిగామని కుర్లా పోలీసులు చెప్పారు. ఓ రోజు అతన్ని విచారణ నిమిత్తం క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించామని అన్నారు. దాంతో సనప్ పోలీసులకు చిక్కాడు.

English summary
A porter information has helped Mubai police to nabb Chandra Bhanu sanap, accused in Machilipatnam techie Anuhya murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X