వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

76-98 మార్కులు: 'లీడర్'గా ఎదిగేందుకు చంద్రబాబు తాపత్రయం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల ర్యాంకింగ్‌లో మొదటి స్థానానికి చేరడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

ఈ విషయం తెలియడంతో... చంద్రబాబు దానిపై స్పందించారు. 76 - 98 మార్కులు సాధించిన రాష్ట్రాన్ని లీడర్‌గా గుర్తిస్తున్నందున త్వరలో ఆ స్థానాన్ని సాధిస్తామన్నారు. పెట్టుబడుల స్నేహపూర్వక రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు శ్రమించిన పరిశ్రమల అధికారులను చంద్రబాబు అభినందించారు.

వ్యాపార నిర్వహణలో దేశంలోనే గుజరాత్ తర్వాత ఏపీ అత్యంత అనుకూలమైన రాష్టమ్రని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన జాబితా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన నవ్యాంధ్ర వ్యాపార నిర్వహణకు అనువైన ప్రదేశమని సోమవారం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.వ్యాపారం నిర్వహణలో తెలంగాణకు 13వ స్థానం నిలిచింది.

AP 2, Telangana at 13 in World Bank state rating: Chandrababu responds

అసెస్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిజినెస్ రిఫార్మ్స్ పేరిట ప్రపంచ బ్యాంక్ రూపొందించిన నివేదికలో వ్యాపారం, భూకేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వౌలిక వసతులు, పన్ను విధానాలు, తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అనే ఎనిమిది అంశాల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది.

ఈ క్రమంలోనే దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ర్యాంకుల్లో టాప్-10లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

ఈ జాబితా తయారీకి పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక బోర్డు (డిఐపిపి), కెపిఎమ్‌జి, సిఐఐ, ఫిక్కీ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ తీసుకుంది. మరోవైపు ఈ ఏడాది వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్‌కు ప్రపంచ బ్యాంక్ 142వ స్థానం కేటాయించడం గమనార్హం.

English summary
The rankings prompted AP Chief Minister N Chandrababu Naidu to give a pat to his officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X