వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంచం అడిగితే స‌మాచారం ఇవ్వండి: సీఎం ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తాం..!

|
Google Oneindia TeluguNews

ఎవ‌రైనా లంచాలు అడిగితే త‌మ‌కు వెంట‌నే స‌మాచారం ఇవ్వాల‌ని..త‌క్ష‌ణం స్పందిస్తామ‌ని ఏసీబీ నూత‌న డీజీగా బాధ్య‌తలు స్వీక‌రించిన కుమార్ విశ్వ‌జిత్ స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చార‌ని.. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌ని చేస్తామ‌న్నారు. ఏపీలో అవినీతి నిర్మూల‌న పైన దృష్టి పెడతామ‌ని చెప్పారు.

ఏసీబీ డీజీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌..
ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్..పాల‌న ప‌రంగా ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. అందులో భాగంగా కీల‌క‌మైన అవినీతి నిరోధ‌క శాఖ డీజీగా కుమార్ విశ్వ‌జిత్‌ను ఎంపిక చేసారు. ఈ మేర‌కు ఆయ‌న్ను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ కావటంతో..వెంట‌నే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనపై పూర్తిగా స్థాయి దృష్టి పెడతామని అన్నారు.

లంచాల కోసం ప్రజలను పీడించే వారి భరతం పడతామని హెచ్చరించారు. అవినీతి నిరోధంలో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తామని విశ్వజిత్‌ స్పష్టం చేశారు. ఎవరైనా లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వడండి.. వెంటనే స్పందిస్తామని తెలిపారు. అలాగే సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారి పేర్లను గోప్పంగా ఉంచుతామని పేర్కొన్నారు.

AP ACB new DG Kumar Viswajit occupied his office replacing ab venkateswara rao..

ఏబీ వేంక‌టేశ్వ‌ర రావుకు పోస్టింగ్ లేకుండా..
ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హానికి గుర‌యి ఇంట‌లిజెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకొని ఇప్ప‌టి వ‌ర‌కూ ఏసీబీ డీజీగా ప‌ని చేసిన ఏబీ వేంక‌టేశ్వ‌ర రావు స్థానంలో కుమార్ విశ్వ‌జీత్ నియ‌మితుల‌య్యారు. టీడీపీ ప్ర‌భుత్వంలో సుదీర్ఘ కాలం నిఘా డీజీగా ప‌ని చేసిన ఏబీ వేంక‌టేశ్వ‌ర రావు పైన వైసీపీ తొలి నుండి ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఆయ‌న పోలీసు డ్ర‌స్ వేసుకొని టీడీపీకి అనుకూలంగా ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించింది. ఆయ‌న పైన ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసారు.

ఎన్నిక‌ల సంఘం ఆయ‌న్ను నిఘా బాధ్య‌త‌ల నుండి త‌ప్పించాల‌ని ఆదేశించ‌టంతో..ఆయ‌న కోసం ఏపీ ప్ర‌భుత్వం కోర్టుకు వెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. ఆత‌రువాత ఆయన్ను ఏసీబీ చీఫ్‌గా నియ‌మించారు. జ‌గ‌న్ ఏపీ సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌రువాత ఆయన్ను త‌ప్పించి..ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా డీజీపీ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది.

English summary
AP ACB new DG Kumar Viswajit occupied his office and stated that if any body demand for bribe directly inform him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X