వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పాలానా రాజధాని ఇక కాపులుప్పాడ..?, తిమ్మాపురంలో సీఎం క్యాంప్ ఆఫీస్, రుషికొండపై నివాసం..?

|
Google Oneindia TeluguNews

సీఆర్డీఏ బిల్లు రద్దు సహా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఆమోదం తెలుపడంతో.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్టణం నుంచి పరిపాలానా ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత త్వరగా కార్యాలయాలు అక్కడికీ తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అయితే పరిపాలనా ఎక్కడనుంచి చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాపులుప్పాడలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

Recommended Video

AP 3 Capitals: కాపులుప్పాడలో Administration Capital,రుషికొండపై CM నివాసం || Oneindia Telugu

జగన్‌ అరెస్టుతో సంబురాలే.. ఇప్పుడేంటిలా? హోం మంత్రి రుసరుస.. బాబాయి కోసం రామ్మోహన్ ఫైర్..జగన్‌ అరెస్టుతో సంబురాలే.. ఇప్పుడేంటిలా? హోం మంత్రి రుసరుస.. బాబాయి కోసం రామ్మోహన్ ఫైర్..

 తిమ్మాపురంలో క్యాంప్ ఆఫీస్..

తిమ్మాపురంలో క్యాంప్ ఆఫీస్..

తిమ్మాపురం గ్రౌహౌండ్స్ స్థలంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడున్న గ్రౌహౌండ్స్ ఆనందపురానికి తరలించారు. అక్కడ 300 ఎకరాల భూమిని గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం కేటాయించింది. తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవల పర్మిషన్ ఇచ్చింది. తిమ్మాపురంలో గెస్ట్ హౌస్ సీఎం క్యాంపు కార్యాలయం వినియోగించుకుంటారని తెలుస్తోంది.

రుషికొండపై నివాసం...

రుషికొండపై నివాసం...

జిల్లాల్లో కూడా స్టేట్ గెస్ట్ హౌస్‌లు నిర్మిస్తున్నారు. సీఎం నివాసం రుషికొండపై ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొండపై ప్రస్తుతం పర్యాటకశాక అతిథి గృహలు ఉన్న సంగతి తెలిసిందే. కొండపైన నివాసం ఏర్పాటు చేస్తే వాస్తుపరంగా, రాష్ట్రాభివృద్దికి మేలు జరుగుతుందని సన్నిహితులు సీఎం జగన్‌కు తెలిపినట్టు తెలుస్తోంది.

 ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మెట్రోరైలు

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, మెట్రోరైలు

భోగాపురాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెండర్ జీఎంఆర్‌కు రావడంతో వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసే ఆలోచనలో సంస్థ ఉంది. విమానాశ్రయం వరకు మెట్రో రైలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మూడు కారిడార్ల పరిధిలో 70 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రాజెక్టు నివేది సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.

సెంట్రల్ జైలు ఆవరణలో డీజీపీ ఆఫీసు..?

సెంట్రల్ జైలు ఆవరణలో డీజీపీ ఆఫీసు..?

దేవదాయశాఖ కార్యాలయాన్ని సింహాచలం దేవస్థానం ఆధీనంలో శ్రీనివాస నగర్‌లో నాలుగు అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉంది. విశాఖ సెంట్రల్ జైలు ఆవరణలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. విశాఖ జైలు 100.40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంగతి తెలిసిందే. స్థలాన్ని సింహాచలం దేవస్థానం ఇదివరకే కేటాయించింది. వుడా భవనంలోకి మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖను మారుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ సహా అన్ని శాఖలకు అందుబాటులో భవనాలు ఉన్నాయి.

English summary
ap administration capital is kapuluppada. camp office in thimmapuram greyhounds and cm residence at rushikonda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X