హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఎఫెక్ట్-చంద్రబాబు ప్లాన్: తెలంగాణలో ఎక్కువ సీట్లు ఎందుకు డిమాండ్ చేయట్లేదు?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జతకట్టడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు షాకయ్యారు ఆ తర్వాత ఇటీవల ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలవడం సంచలనంగా మారింది.

<strong>కాంగ్రెస్‌తో దోస్తీ, జగన్‌ను దెబ్బతీసేందుకు బాబు వ్యూహం!: పవన్‌కు ప్లస్, జనసేనతో టచ్‌లో కీలక నేతలు</strong>కాంగ్రెస్‌తో దోస్తీ, జగన్‌ను దెబ్బతీసేందుకు బాబు వ్యూహం!: పవన్‌కు ప్లస్, జనసేనతో టచ్‌లో కీలక నేతలు

ఈ విషయం పక్కన పెడితే, కాంగ్రెస్‌తో జత కట్టడం, తెలంగాణలో టీడీపీకి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయకపోవడం వంటి అంశాలు పరిశీలిస్తుంటే చంద్రబాబు 2019లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

తెలంగాణలో సీట్ల కోసం బెట్టు వద్దు.. ఇదీ చంద్రబాబు సూచన

తెలంగాణలో సీట్ల కోసం బెట్టు వద్దు.. ఇదీ చంద్రబాబు సూచన

కాంగ్రెస్ పార్టీ మనకు 12 నుంచి 15 సీట్లు ఇస్తుందని, బలం ఉన్నచోటే పోటీ చేద్దామని, ఓడిపోయే విధంగా ఎక్కువ సీట్లను అడగవద్దని ఇటీవల చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ సందర్భంగా అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవద్దన్న చంద్రబాబు వ్యాఖ్యలను వీ హనుమంత రావు వంటి కాంగ్రెస్ నేతలు కూడా స్వాగతించారు.

బలం లేని పార్టీలే సీట్లు అడుగుతుంటే, టీడీపీ మౌనం

బలం లేని పార్టీలే సీట్లు అడుగుతుంటే, టీడీపీ మౌనం

మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, కోదండరాం తెలంగాణ జన సమితి పార్టీలు ఉన్నాయి. టీడీపీ 14 నుంచి 16 సీట్లతో సర్దుకుపోతోంది. కోదండరాం 12 సీట్ల వరకు, సీపీఐ 8 సీట్ల వరకు డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు కూటమిలో టీడీపీతో వచ్చిన చిక్కు లేదు. మిగిలిన రెండు పార్టీలతోనే సర్దుబాటు ముందుకు సాగడం లేదు. అంతగా బలం లేని సీపీఐ 8 సీట్లు కోరుతుంటే, ఇటీవలే పుట్టిన కోదండ పార్టీ 12 సీట్లు అడుగుతుంటే తెలంగాణలో మంచి పునాదులు ఉన్న టీడీపీ మాత్రం 14 నుంచి 16 సీట్లు ఇచ్చినా సర్దుకుపోవడంపై చర్చ సాగుతోంది.

చంద్రబాబు మనసులో 'ఏపీ' ఆలోచన

చంద్రబాబు మనసులో 'ఏపీ' ఆలోచన

చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం లేదు. ఎక్కువ సీట్లు వద్దని చంద్రబాబు చెప్పడం వెనుక ఎన్నో ఆలోచనలు ఉండవచ్చునని భావిస్తున్నారు. తెలంగాణలో ఎలాగూ టీడీపీ అధికారంలోకి రాదు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నుంచి తక్కువ సీట్లు తీసుకొని, 2019 ఎన్నికల్లో ఏపీలో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అక్కడ ఆ పార్టీకి తక్కువ సీట్లు ఇవ్వవచ్చుననేది చంద్రబాబు ఆలోచన కావొచ్చునని అంటున్నారు. తాము ఎలాగు అధికారంలోకి రామని తెలిసి, తెలంగాణలో బలం ఉన్నామేం సీట్ల కోసం డిమాండ్ చేయలేదని, కాబట్టి ఏపీలో మీకూ (విభజన నేపథ్యంలో బలం తగ్గింది) బలం లేనందున మీరు డిమాండ్ చేయవద్దనేది చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఇప్పటికే చెప్పినట్లుగా అయిందని, ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తే వాళ్లకు దాదాపు తెలంగాణలో టీడీపీకి సీట్లు ఇచ్చినట్లే ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులకు సీట్లు వస్తాయని అంటున్నారు.

 పవన్, జగన్‌లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అనివార్యం

పవన్, జగన్‌లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అనివార్యం

మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనివార్యమని టీడీపీ భావిస్తోంది. ప్రజా వ్యతిరేకత, జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల దూకుడు నేపథ్యంలో కాంగ్రెస్‌తో జత కలిసి లబ్ధి పొందాలని టీడీపీ భావిస్తోంది. అయితే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చినందున, ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చి నోరు మూయించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

English summary
AP CM and TDP national president Nara Chandrababu Naidu is plan behind not asking for more seats in Telangana assembly elections from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X