వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతి:ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల కోసం...ఇంటీరియర్‌ డిజైన్ల కొలువు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:రాజధాని నగరంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎపి గవర్నమెంట్ నిర్మిస్తున్న హౌసింగ్‌ ప్రాజెక్టులకు అనువైన ఇంటీరియర్‌ డిజైన్లను సిఆర్డీఏ ఉన్నతాధికారులు పరిశీలించారు.

రాజధాని నగరం పరిధిలోకి వచ్చే రాయపూడి, నేలపాడుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐఎస్‌, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వం హౌసింగ్‌ ప్రాజెక్టులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి అనువైన ఇంటీరియర్‌ డిజైన్లను విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఆర్కాప్‌ అనే సంస్థ ప్రతినిధులు గురువారం ఈ డిజైన్లను కొలువు తీర్చారు.

గవర్నమెంట్...హౌసింగ్‌ ప్రాజెక్టు

గవర్నమెంట్...హౌసింగ్‌ ప్రాజెక్టు

ఉన్నతాధికారులకు, ఎన్‌జిఒలకు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం ప్రభుత్వం మొత్తం 61 టవర్లలో 3840 నివాస గృహాలను సిద్దం చేస్తున్నారు. ఈ నిర్మాణాలను సరికొత్త షీర్‌వాల్‌ టెక్నాలజీతో చేపడుతున్నారు. ఎమ్మెల్యేల కోసం 12 టవర్లలో 288 ఇళ్లు, ఉన్నతాధికారుల కోసం 6 టవర్లలో 144 ఇళ్లు, ఎన్‌జిఒల కోసం 22 టవర్లలో 1968 ఇళ్లు, అధికారుల కోసం 15 టవర్లలో 720 ఇళ్లు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 6 టవర్లలో 720 ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

ఇంటీరియర్ డిజైన్ల...కొలువు

ఇంటీరియర్ డిజైన్ల...కొలువు

మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునికమైన ఇంటీరియర్ సామాగ్రిని, వివిధ రకాల మెటీరియల్స్ ను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు వాటిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఈ కాంప్లెక్స్‌లోని టవర్లలో ఉండే హాళ్లు, సిట్టింగ్‌ ఏరియా, పడక గదులు, బాల్కనీ, మెట్ల రెయిలింగ్‌లు, కారిడార్లు, లిఫ్ట్‌ క్లాడింగ్‌ల కోసం రూపొందించిన డిజైన్ల గురించి తెలియజేశారు. కిచెన్‌ ప్లాట్‌ఫాం, కప్‌ బోర్డులు, బాత్‌రూం ఫిట్టింగ్స్‌, టైల్స్‌, వాల్‌ ఫినిషింగ్‌, ఫాల్స్‌సీలింగ్‌ మోడళ్లను ప్రదర్శించారు.

అధికారులకు...వివరణ

అధికారులకు...వివరణ

వీటితోపాటు ఆయా హౌసింగ్‌ ప్రాజెక్టుల్లోని క్లబ్‌ హౌస్‌ల మోడళ్లను కూడా చూపారు. వీటిల్లో ఏర్పాటు చేసే స్విమ్మింగ్‌పూల్‌, అవుట్‌డోర్‌, ఇండోర్‌ గేమ్స్‌ తదతర వసతుల గురించి నిపుణులు అధికారులకు వివరించారు. వీటిని పరిశీలించిన సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ షణ్మోహన్‌ డిజైన్లపై కొంత అసంతృప్తిలోనైనట్లు తెలుస్తోంది.

అసంతృప్తి...మరోసారి

అసంతృప్తి...మరోసారి

దీంతో ఈ ఇంటీరియర్ డిజైన్లను మరింత ఆకర్షణీయంగా మలచాల్సిందిగా ఆర్కాప్‌ ప్రతినిధులకు వీరు సూచించారు. దీంతో సిఆర్డీఏ అధికారులను ఆకట్టుకోవడం కోసం మరోసారి ఈ డిజైన్ల కొలువు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Amaravati: CRDA officials reviewed interior designs for housing projects being constructed by AP Government for public representatives and government employees in the capital city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X