వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణా విభజన పంచాయితీ: నేడే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలకభేటీ.. సర్వత్రా ఉత్కంఠ!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన పంచాయితీ నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో కొనసాగనుంది. ఏపీ, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినా పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా నేటికీ ఉన్న విషయం తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాల మధ్య విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు హోం మంత్రిత్వ శాఖ నేడు న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

 కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు కీలక భేటీ

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు కీలక భేటీ


కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు ఇప్పటి వరకు అనేక సార్లు సమీక్ష సమావేశాలు జరిగినా ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మళ్లీ తాజాగా కీలక సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలైనా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన పంచాయతీలపై మరోమారు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇప్పుడైనా ఇరు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై సయోధ్య కుదురుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీ, తెలంగాణా విభజన సమస్యలపై కీలక భేటీకి రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు

ఏపీ, తెలంగాణా విభజన సమస్యలపై కీలక భేటీకి రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు

ఈరోజు సమావేశానికి 14 అంశాలతో అజెండాను రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక, ఆహారం, విద్య, వ్యవసాయం, పెట్రోలియం, ఆరోగ్య మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు, రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు హోం శాఖ తదితర మంత్రిత్వ శాఖలకు పంపిన కేంద్రం ద్వైపాక్షిక మరియు ఇతర అంశాలపై సమావేశం, ప్రధాన చర్చల అజెండాగా పేర్కొంది. దీనికి తగినట్టుగా అన్నీ శాఖల నుండి పూర్తి సమాచారంతో రావాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని శాఖల నుండి పూర్తి సమాచారంతో భేటీలో పాల్గొననున్నాయి. ఎవరి వాదన వారు వినిపించడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెడీ అయ్యాయి.

 ఉమ్మడి రాష్ట్రం లోని సంస్థల విభజన సమస్యలపై చర్చ

ఉమ్మడి రాష్ట్రం లోని సంస్థల విభజన సమస్యలపై చర్చ

ఈ సమావేశంలో ద్వైపాక్షిక విభాగంలో భాగంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు తెలుసుకోనున్నారు. వారి అభ్యంతరాలను విన్న తర్వాత ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏం చేయాలనే దాని పైన కూడా చర్చించనున్నారు. ఇక ఇదే సమయంలో విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజనకుసంబంధించి చర్చించనున్నారు.షెడ్యూల్ 10 లోని రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో ప్రస్తావించనిసంస్థల విభజన, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్, ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన సమస్యలపైన కూడా చర్చించనున్నారు.

ఉమ్మడి సంస్థల్లో అప్పుల పంపిణీ, నగదు నిల్వలపై చర్చ

ఉమ్మడి సంస్థల్లో అప్పుల పంపిణీ, నగదు నిల్వలపై చర్చ

ఉమ్మడి సంస్థల్లో విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టిన ప్రాజెక్టుల రుణాల విభజన, వివిధ కేంద్రప్రయోజన పథకాలకు బ్యాంకుల్లోని నగదు నిల్వల విభజన, బియ్యం సబ్సిడీకి సంబంధించి తెలంగాణ పౌరసరఫరాల సంస్థ నుంచి ఏపీ పౌరసరఫరాల సంస్థకునగదు క్రెడిట్ విడుదల తదితర సమస్యలను అజెండాలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి నిధులపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది.

విభజన పంచాయితీపై కీలక భేటీ .. ఏం తేలుతుందో?

విభజన పంచాయితీపై కీలక భేటీ .. ఏం తేలుతుందో?

ఇక ఇతరత్రా సమస్యలను చూస్తే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక పన్ను రాయితీలు, ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడినఉమ్మడి ఏడు జిల్లాల అభివృద్ధి గ్రాంటు, రెవిన్యూ లోటు,పన్నుల సమస్యలు, విద్యా సంస్థల ఏర్పాటు, రాజధానికి ర్యాపిడ్ రైలు కనెక్టివిటీపై కూడా చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన జరిగిన నాటి నుండి ఆస్తుల పంపకాలలో అనేక సందర్భాలలో భిన్నాభిప్రాయాలు చోటుచేసుకోవడంతో నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కీలక భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

English summary
Union Home Ministry will hold a key meeting today on the issues of AP and Telangana bifurcation issues. Besides bilateral issues, other issues will be discussed in this meeting. Two telugu states chief secretaries will attend the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X