వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో ఉంటాం: సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ..తెలంగాణ మ‌ధ్య స‌మ‌స్య‌ల పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో అనేక అంశాల మీద చ‌ర్చ సాగింది. ప్ర‌ధానంగా నిరుప‌యోగంగా స‌ముద్రంలో క‌లుస్తున్న గోదావ‌రి నీటిని రెండు రాష్ట్ర రైతు ల‌కు అందుబాటులోకి తెచ్చే విధానం పైనే చ‌ర్చించారు. అందులో బాగంగా ఇంజ‌నీరింగ్ నిపుణుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసారు. ఇత‌ర అంశాల మీద చ‌ర్చించి..ప‌రిష్కార మార్గాలు సూచించేందుకు సీఎస్‌లు..అధికారులు స‌మావేశం అవుతున్నారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ఇచ్చి పుచ్చుకొనే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించారు.

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం..స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం..స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు కేసీఆర్‌.. జగన్‌ సమావేశం జరిగింది.
ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా నీటి స‌మ‌స్య‌ల పైనే చ‌ర్చించారు. ఇప్పుడున్న విధానాల‌నే అనుస‌రిస్తే భ‌విష్య‌త్ త‌రాలు నీటి కోసం తీవ్ర ఎద్ద‌డి ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని..దీనికి ప‌రిష్కార మార్గం చూపించ‌టంతో పాటుగా రెండు ప్రాంతాల్లోని ప్ర‌తీ ఎక‌రాకు నీరు ఇచ్చేలా కొత్త విధానం అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం గోదావరి నుంచి కృష్ణాకు నదీజలాల తరలింపు కమిటీ వేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లతో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలనే విషయంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో..ఇత‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌ల పైనా ఇచ్చి పుచ్చుకొనే విధంగా నిర్ణ‌యాలు ఉండాల‌ని..ఆ బాధ్య‌త‌ల‌ను రెండు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు అప్ప‌గించారు.

స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణ కోరుకుంటున్నాం..

స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణ కోరుకుంటున్నాం..

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల స‌మావేశం అనంత‌రం తెలంగాణ‌..ఏపీ మంత్రులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌కే ముందే కేసీఆర్ నాడు రైతులు సాగు నీరు లేక ఏర‌కంగా ఇబ్బంది ప‌డుతుందీ గుర్తించార‌ని..ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని ఈటెల రాజేంద‌ర్ వివ‌రించారు. చిన్నపాటి సమస్యలతో పాటు సాగునీటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సరిపడా తాగు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఇరు రాష్ట్రాల్లోని పంటపొలాలకు నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రులు సూచించారని చెప్పుకొచ్చారు. ఏపీ - తెలంగాణ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఉండ‌కూడ‌ద‌నేదీ త‌మ విధానం అని స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రుల స‌మావేశానికి కొన‌సాగింపుగా శ‌నివారం సైతం రెండు రాష్ట్ర అధికారులు స‌మావేశ‌మై పెండింగ్ అంశాల పైన చ‌ర్చిస్తార‌ని మంత్రి స్ప‌ష్టం చేసారు.

చారిత్రాత్మ‌క‌మైన రోజు..ముందుడుగు ప‌డింది..

చారిత్రాత్మ‌క‌మైన రోజు..ముందుడుగు ప‌డింది..

ఏపీ-తెలంగాణ‌కు ఇది చారిత్రాత్మ‌క రోజ‌ని ఏపీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాధ్ చెప్పుకొచ్చారు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు న‌దీ జ‌లాల స‌మిష్టి వినియోగం పైనే ప్ర‌ధానంగా చ‌ర్చించార‌ని వివ‌రించారు. ఎక్క‌డ నీటి ఎద్ద‌డి ఉంద‌నే విష‌యం పైన ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అవ‌గాహ‌న‌తో ఉన్నార‌ని..వాటి ప‌రిష్కారాని ఏం చేయాల‌నే దాని పైన నిపుణులు.. సీనియ‌ర్ అధికారులు..ఇంజ‌నీర్లను బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రెండు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించుకుని దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నామని బుగ్గన తెలిపారు. కోర్టులు, ట్రైబ్యునళ్లకు వెళ్లినా.. కొన్ని సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. సమస్యలపై సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకుందామనే భావన ముఖ్యమంత్రులిద్దరిలోనూ ఉందన్నారు. అభివృద్ధి కోసం కలిసి ప్రయాణం చేయాలని ఇద్ద‌రు ముఖ్య‌మంత్రు లు నిర్ణయించుకున్నారని వివ‌రించారు. నదీజలాల వినియోగానికి సంబంధించి జులై 15లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు బుగ్గన చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌రో స‌మావేశం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
AP and Telangana Chief Ministers Jagan and KCR decided to mutual co operation on water distribution in both states. long meeting conducted on godavari water utilisation in both states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X