అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు థాంక్స్: తమ్మినేని

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. సంక్షేమ పథకాల కోసమే విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటిస్తున్నానని సీఎం జగన్ తెలిపారు. అమరావతి అంటే తనకు కోపం లేదని, ఈ ప్రాంత అభివృద్ది కోసం లెజిస్లేటిల్ క్యాపిటల్ కొనసాగిస్తున్నామని చెప్పారు. రాయలసీమకు చెందని కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటిల్ రూపొందించబోతున్నామని తెలిపారు. సీఎం జగన్ ప్రతిపాదించిన రాజుధాని బిల్లు చర్చ ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

తమ్మినేని భావోద్వేగం

తమ్మినేని భావోద్వేగం

సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశాక.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కార్యాలయాలు, అమరావతిలో లెజిస్లేటివ్ కార్యాలయాలు, కర్నూలులో జ్యుడిషీయల్ ఆఫీసు కోసం సభలో సీఎం జగన్ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని సభ ఆమోదం తెలిపింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతోపాటు.. సీఆర్డీఏ బిల్లు ఉపసంహరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తర్వాత స్పీకర్ మాట్లాడుతూ..చారిత్రాత్మకమైన బిల్లులో భాగస్వామ్యమైనందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

వాటర్ గ్రిడ్

వాటర్ గ్రిడ్

సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించేందుకు మొగ్గుచూపుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇంటింటికీ మంచినీరు ఇవ్వాల్సిన వాటర్ గ్రిడ్ కోసం రూ.45 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు.

సాగునీరు..

సాగునీరు..

ఏపీలో 62 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని సీఎం జగన్ చెప్పారు. కానీ కృష్ణలో పరిస్థితి నానాటికి దిగజారిపోతుందన్నారు. 40 ఏళ్ల సీడబ్య్లూసీ ప్రకారం 1200 టీఎంసీల నీరు కుచించికుపోతుందని గుర్తుచేశారు. ఐదేళ్లలో 600 టీఎంసీలకు చేరిందని సీఎం జగన్ వివరించారు. అది 400 టీఎంసీలకు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కృష్ణా ప్రాజెక్టుతో 8 జిల్లాలు ఆధారపడి ఉన్నాయని.. రాయలసీమ సహా గుంటూరు, కృష్ణా సాగు, తాగునీరు ఇబ్బంది కలుగబోదన్నారు. జలయజ్ఖం కోసం 30 వేల కోట్ల ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వ్యవసాయానికి డోకా ఉండబోదని స్పష్టంచేశారు.

English summary
ap assembly Approved the capital change bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X