ఏపీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఫిక్స్ - రాజధానుల బిల్లులు : మంత్రులకు లాస్ట్ ఛాన్స్..!!
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో తొలి రోజున సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఆ మరుసటి రోజున 8వ తేదీన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసగించనున్నారు. అదే రోజు జరిగే బీఏసీ సమావేశంలో సభా నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

బడ్జెట్ సమావేశాలు కీలంగా..
ఇక, ఈ నెల 11 లేదా 14వ తేదీన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా ఆర్దిక మంత్రి బుగ్గన సమీక్షలు నిర్వహిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాలు ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయి. త్వరలో సీఎం జగన్ తన మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్నారు. ఇప్పటికే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెట్టిన సీఎం జగన్ ఇక, ఈ సమావేశాల్లో కీలక బిల్లుల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉభయ సభల్లోనూ ఉప సంహరించుకుంది. అయితే, అదే సమయంలో మూడు రాజధానుల బిల్లులను మరింత సమగ్రంగా తిరిగి సభ ముందుకు తీసుకొస్తామంటూ సీఎం జగన్ అప్పుడే సభలో ప్రకటించారు.

మూడు రాజధానుల బిల్లు కు ఛాన్స్
ఈ నిర్ణయానికి సంబంధించి న్యాయ పరమైన సమస్యలు తలెత్తకుండా... మూడు రాజధానుల బిల్లులను సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది పూర్తయితే..ఇక, సీఎం జగన్ విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో..పాటుగా మూడేళ్ల పాలన పూర్తి కానుండటంతో... ప్రస్తుత మంత్రివర్గం సైతం ప్రక్షాళన చేయనున్నారు. తొలుత రెండున్నారేళ్లకే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావించినా.. కరోనా కారణంగా ఇబ్బందులు రావటంతో..మూడేళ్లకు మార్చాలని డిసైడ్ అయ్యారు.

మంత్రివర్గ విస్తరణ సైతం
అందులో భాగంగా.. ఇప్పుడున్న మంత్రుల్లో మెజార్టీ సంఖ్యలో తప్పించాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని సీఎం ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దీంతో..మంత్రివర్గ విస్తరణ సైతం పూర్తి చేసుకొని..2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వం - పార్టీ పరంగా నిర్ణయాలు అమలు చేయాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. దీంతో..మంత్రులుగా చాలా మందికి ప్రస్తుత సమావేశాలు చివరిగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించటంతో పాటుగా.. పార్టీ కోసం పని చేసి..అవకాశం దక్కని వారికి ఈ సారి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు.
Recommended Video

టార్గెట్ 2024..జగన్ ప్రణాళికలు
ఇక.. పాలనా పరంగా పలు కీలక నిర్ణయాలకు ఈ సారి సమావేశాలు కీలకం కానున్నాయి. రాజకీయంగానూ అనేక అంశాల పైన సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో అడుగు పెట్టనని శపధం చేసారు. దీంతో..మిగిలిన టీడీపీ సభ్యులు సభకు హాజరవుతారా..లేక, గతంలో వైసీపీ అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తారా అనేది ఇప్పుడు కీలక చర్చగా మారింది. ఇక, ఈ సమావేశాల ద్వారా రానున్న రెండేళ్ల భవిష్యత్ ప్రణాళికలను సీఎం జగన్ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications