2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ జోరు కొనసాగింది. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈనెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ స్పష్టం చేశారు. ఈ విజయం దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైందని జగన్ చెప్పారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా తమ అధినేత జగన్‌ను కలిసేందుకు తాడేపల్లికి క్యూకట్టారు. దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం కిటకిటలాడుతోంది. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో జగన్ తన కేబినెట్‌ను కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
శుక్రవారం తన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు జగన్. ఇక శనివారం వైసీపీ శాసనసభాపక్షం సమావేశమై జగన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం 30వ తేదీన కొత్త ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
Newest FirstOldest First
6:05 PM, 26 May
ఏపి భవన్లో తెలుగు అధికారులతో సమావేశమైన జగన్
5:19 PM, 26 May
ప్రత్యేక హోదాకు సహకరించాలని ప్రధానిని కోరిన జగన్
5:19 PM, 26 May
ఢిల్లిలో ప్రధాని మోడీని కలిసిన వైఎస్ జగన్
5:18 PM, 26 May
తిరుపతికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
5:17 PM, 26 May
రాజధాని స్కాంను బయటకు తీస్తామన్న జగన్
5:17 PM, 26 May
మంగళగిరి నా ఇళ్లు : మాజీ మంత్రి లోకేష్ ఎన్నికల అనంతరం మంగళగిరి చేరుకున్న నారా లోకేష్
2019 General elections came to an end on May 19th. The biggest ever elections were held in seven phases. The first Phase began on April 11th and the final phase ended on May 19th.In Andhra pradesh assembly polls were also held along with the loksabha polls.There was a mixed opinion on Exit polls. Few suggested Chandrbabu would make into power wihile majority of exit polls said that Jagan reddy will form govt.But from sometime now the results will be out. First the postal ballots will be counted after which VVPATS and EVMs will be counted.By 11 in the morning a clear picture might emerge.