• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లైవ్: మండలి రద్దుపై సోమవారం చర్చిద్దామన్న సీఎం జగన్..సభను వాయిదా వేసిన స్పీకర్

|

అమరావతి:ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉండగా.. మరొక రోజుకు పొడిగించడం జరిగింది. ఉదయం ప్రారంభమైన సభలో ముందుగా అమ్మఒడిపై సభలో చర్చ జరిగింది. అనంతరం విద్యాహక్కు చట్ట సవరణ బిల్లును మరోసారి పాస్ చేయించడం జరిగింది. అనంతరం బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభలో చర్చించారు. టీడీపీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడం చాలా దారుణమని సభ్యులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు చంద్రబాబు గ్యాలరీలో వచ్చి కూర్చొని మండలి ఛైర్మెన్‌ను ప్రభావితం చేశారని సభ్యులు మండిపడ్డారు. ఇక చివరిగా మాట్లాడిన సీఎం జగన్.. నిన్న పరిణామాలు తనను బాధించాయని చెప్పారు. అదే సమయంలో బిల్లులపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రమే పెద్దల సభ ఉందని చెప్పిన సీఎం జగన్... బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి అడ్డుకునే కుట్రను చేశారని మండిపడ్డారు. సభలో బుధవారం మండలి ఛైర్మెన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.

మరోవైపు మండలి ఛైర్మెన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్. విచక్షణాధికారం పేరుతో ఛైర్మెన్ అసహ్యంగా వ్యవహరించారని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక

AP Assembly live updates: AP Assembly passes Decentralisation bill 2020

గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్ మీకోసం.

Newest First Oldest First
6:01 PM, 23 Jan
శాసనసభ సోమవారం ఉదయం 11 గంటలకు వాయిదా
6:00 PM, 23 Jan
సోమవారం రోజున వరకు సభలను పొడిగించండి.. సుదీర్ఘంగా చర్చిద్దాం.. మండలిని కొనసాగిద్దామా లేదా నిర్ణయం తీసుకుందాం: సీఎం జగన్
5:59 PM, 23 Jan
చంద్రబాబు విశాఖ నుంచి పాలన సాగించలేదా..? :సీఎం జగన్
5:58 PM, 23 Jan
రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు: సీఎం జగన్
5:58 PM, 23 Jan
28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉంది:సీఎం జగన్
5:57 PM, 23 Jan
జయలలిత బతికున్న రోజుల్లో ఊటీ నుంచి పాలన చేసేవారు: సీఎం జగన్
5:57 PM, 23 Jan
22 రాష్ట్రాల్లో మండళ్లు లేవు: సీఎం జగన్
5:56 PM, 23 Jan
చట్టాలు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు: సీఎం జగన్
5:49 PM, 23 Jan
సభలో టీచర్లు, డాక్టర్లు, రాజకీయనాయకులు, యాక్టర్లు, రైతులు, ఫారిన్ రిటర్న్స్ కూడా ఉన్నారు: సీఎం జగన్
5:32 PM, 23 Jan
పాలకుల్లా కాదు సేవకులంలా ఉంటామని చెప్పి పనిచేస్తున్నాము..గత 7నెలలుగా ప్రజాశ్రేయస్సు కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం జగన్
5:32 PM, 23 Jan
శాసన సభలో 86శాతం మార్కులు వచ్చాయి: సీఎం జగన్
5:31 PM, 23 Jan
మండలి నుంచి సలహాలు సూచనలు మాత్రమే వస్తాయి లేదా బిల్లను రిజెక్ట్ చేయడం జరుగుతుంది: సీఎం జగన్
5:31 PM, 23 Jan
పేద ప్రజల కోసం మంచి చట్టాలు చేస్తే టీడీపీ దాన్ని అడ్డుకోవడం చాలా దారుణం: సీఎం జగన్
5:29 PM, 23 Jan
మండలి ఛైర్మెన్ ప్రసంగాన్ని సభలో వీడియోను ప్రదర్శించిన సీఎం జగన్
5:29 PM, 23 Jan
మండలిలో జరిగిన పరిణామాలు బాధించాయి: సీఎం జగన్
5:20 PM, 23 Jan
మండలిని రద్దు చేయండి: డిప్యూటీ సీఎం చంద్రబోస్
5:19 PM, 23 Jan
జాయింట్ సెలెక్ట్ కమిటీ వేద్దామని సూచనలు ఇచ్చినా సీఎం ఒప్పుకోలేదు: డిప్యూటీ సీఎం చంద్రబోస్
5:18 PM, 23 Jan
గంటల కొద్దీ సభాసమయాన్ని వృథా చేశారు: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
5:17 PM, 23 Jan
రాజకీయాల్లో మోసాలు ఉండకూడదు పారదర్శకంగా ఉండాలని సూచించిన వ్యక్తి సీఎం జగన్: పిల్లి సుభాష్ చంద్రబోస్
5:16 PM, 23 Jan
చర్చలో మంత్రుల సూచనలను ఛైర్మెన్ పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
5:15 PM, 23 Jan
సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రమే పెద్దల సభ ఉంది: డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్
4:40 PM, 23 Jan
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు: అంబటి రాంబాబు
4:40 PM, 23 Jan
రైతులకు నిజంగానే ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించేందుకు ద్వారాలు తెరిచేఉన్నాయి: అంబటి రాంబాబు
4:39 PM, 23 Jan
రాజకీయ గందరగోళం సృష్టించేందుకు రైతుల ఉద్యమాన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు: అంబటి రాంబాబు
4:38 PM, 23 Jan
చంద్రబాబు మరొకసారి రైతులను అమరావతి జేఏసీ నాయకులను మోసం చేసేందుకు తయారయ్యారు: అంబటి
4:36 PM, 23 Jan
నిబంధనల ప్రకారం బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని భావించాను..కానీ బిల్లును అడ్డుకునే కుట్ర జరిగింది: అంబటి
4:35 PM, 23 Jan
చంద్రబాబు మండలి గ్యాలరీకి వెళ్లారని తెలిసి నేను కూడా అటువైపు వెళ్లాను: అంబటి రాంబాబు
4:01 PM, 23 Jan
రాజ్యాంగం గురించి సభను నడిపే పద్ధతుల గురించి ప్రత్యేక సమావేశాలు పెట్టి ప్రజలకు తెలిసేలా చేయాలి: ధర్మాన
4:00 PM, 23 Jan
బిల్లును ఆపడమంటే ప్రజాభిప్రాయంను వ్యతిరేకించడమే: ధర్మాన
3:59 PM, 23 Jan
ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారు: ధర్మాన
READ MORE

English summary
AP govt has introduced the capital decentralization bill in Assembly. After hours of long debate the bill was passed in the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X