వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ కోసం ఆర్డినెన్స్..?

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సభలను ప్రోరోగ్ చేస్తూ సాంకేతికంగా ఇబ్బందులు ఉండవని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

గతంలో కూడా..

గతంలో కూడా..

ఇప్పుడే కాదు గతంలో కూడా సభలను ప్రోరోగ్ చేశారని ఏపీ ప్రభుత్వం గుర్తుచేస్తోంది. ట్రిపుల్ తలాక్, భూ సేకరణ చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చే సమయంలో లోక్‌సభ, రాజ్యసభలను ప్రోరోగ్ చేస్తున్నామని గుర్తుచేశారు. అంతేకాదు రాజ్యసభ నడుస్తోండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయని చెబుతున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానానా ఫాలో అవుతామని చెప్పారు.

 ఇందుకే..

ఇందుకే..

ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉప సంహరణ బిల్లును మండలిలో చైర్మన్ షరీఫ్ అడ్డుకొన్న సంగతి తెలిసిందే. సెలక్ట్ కమిటీకి సిఫారసు చేయడంతో.. బిల్లుల ఆమోదం అడుగుదూరంలో నిలిచిపోయాయి. దీంతో ఏకంగా మండలిని రద్దుచేస్తూ శాసనసభ తీర్మానం చేసింది. ఇది పార్లమెంట్‌కు చేరింది. మండలి రద్దవాలంటే కనీసం 18 నెలల సమయం పడుతోంది. మరి ఈ లోపు మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీచేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఆ దిశగా అడుగులేస్తోంది.

షరీఫ్ అడ్డుకోవడంతో..

షరీఫ్ అడ్డుకోవడంతో..

మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ ఉఫసంహరణ బిల్లుకు కూడా ఆమోదించింది. తర్వాత మండలిలో అడ్డుతగిలింది. మండలి చైర్మన్ షరీఫ్ అడ్డుకోవడంతో... శాసనమండలిని రద్దుచేస్తూ శాసనసభ తీర్మానం చేసి.. పార్లమెంట్‌కు పంపిన సంగతి తెలిసిందే.

English summary
ap assembly, mandali prorogue governer release notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X