ఏపీ అసెంబ్లీ .. అంతా శ్రీనివాసం .. మ్యాటర్ ఏంటంటే
త్వరలో కొలువు తీరనున్న ఏపీ అసెంబ్లీలో చాలా చిత్రమైన పరిస్థితి నెలకొననుంది . శ్రీనివాస్ అని పిలిస్తే ఒకరికి 13 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వనున్నారు. గతంలో అసెంబ్లీలో ఇంత పెద్ద మొత్తంలో శ్రీనివాసులు ఉన్నది లేదు. అందుకు భిన్నంగా తాజాగా ఏపీ అసెంబ్లీలో భారీ ఎత్తున శ్రీనివాస్ పేరున్న వారు ఉన్నారు .సభలో ఎవరైనా గట్టిగా శ్రీనివాస్ అని పిలిస్తే మాత్రం ఎవరిని పిలిచారో గుర్తించటం కష్టం. పూర్తిగా ఇంటి పేరుతో పాటు పిలిస్తేనే ఎవరిని పిలిచారో అర్ధం అవుతుంది. ఇక పొరబాటున శ్రీనివాస్ అన్నారో తక్కువలో తక్కువ 13మంది శ్రీనివాసులు నన్నేనా పిలిచింది? అంటూ క్వశ్చన్ వేయకమానరు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుండే ఏపీ అసెంబ్లీలో ఈసారి ఏకంగా 13 శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు.
దీంతో.. ఏపీ అసెంబ్లీ శ్రీనివాసంగా మారిన పరిస్థితి. మరి.. ఇంత మంది శ్రీనివాసుల్ని ఎలా గుర్తు పెట్టుకుంటారో.. ఒకరిని పిలిస్తే మరొకరు స్పందించకుండా ఉండేందుకు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరమని చెప్పాలి. ఇక.. ఈసారి సభకు ఎన్నికైన శ్రీనివాసుల జాబితా చూస్తే..

1. కె.శ్రీనివాసరావు (ఎస్.కోట)
2. ముత్తంశెట్టి శ్రీనివాసరావు(భీమిలి)
3. గంటా శ్రీనివాసరావు (విశాఖ)
4. చెల్లుబోయిన శ్రీనివాస్ (రామచంద్రపురం)
5. జి.శ్రీనివాసనాయుడు(నిడదవోలు)
6. గ్రంథి శ్రీనివాస్ (భీమవరం)
7. పుప్పాల శ్రీనివాసరావు (ఉంగుటూరు)
8. ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్(ఏలూరు)
9. వెల్లంపల్లి శ్రీనివాసరావు(విజయవాడ వెస్ట్)
10. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నర్సరావుపేట)
11. బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
12. కె.శ్రీనివాసులు (కోడూరు)
13. ఆరణి శ్రీనివాసులు(చిత్తూరు)
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!