వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు, లోకేశ్‌పై సభలో తీర్మానం, ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన, జక్కంపూడి రాజా మద్దతు

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్ ప్రవర్తనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మార్షల్స్‌పై దాడి చేయడంపై విచారం వ్యక్తం చేయమని స్పీకర్ సూచించినా.. చంద్రబాబు వినిపించుకోలేదు. ఘటనకు తాను కారణమైతే, ఆపిన మీరు విచారం వ్యక్తం చేయమని చంద్రబాబు ఆనడంతో సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

సభలో తీర్మానం

సభలో తీర్మానం

మార్షల్స్‌పై చంద్రబాబు నాయుడు, లోకేశ్ ప్రవర్తన సరికాదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సభా గౌరవాన్ని, సంప్రదాయాలను మరింత ఇనుమడింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుడి అనుచిత ప్రవర్తనపై చర్యలు చేపట్టాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. బుగ్గన తీర్మానం తర్వాత సభలో సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు.

జక్కంపుడి రాజా మద్దతు

జక్కంపుడి రాజా మద్దతు

తీర్మానంపై జక్కంపూడి రాజా తొలుత మాట్లాడారు. తీర్మానానికి మద్దతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రావాల్సిన గేటు నుంచి రాకుండా మరో గేటు నుంచి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అలా కాకుండా మార్షల్‌పై అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. చంద్రబాబుకు పౌరుషం లేదని కామెంట్ చేశారు. సిగ్గు, శరం, మానం, మర్యాద, చీము, నెత్తురు లేదని విమర్శించారు.

అందుకే 151 సీట్లు

అందుకే 151 సీట్లు

తమ నేత జగన్‌ దమ్ము లీడర్ అని పేర్కొన్నారు. పౌరుషం ఉన్న నేత అయినందునే 151 సీట్లు వైసీపీకి వచ్చాయని పేర్కొన్నారు. చంద్రబాబు అంటే కోపగించుకునేవారలో గోరంట్ల బుచ్చయచౌదరి ముందువరసలో ఉంటారని చెప్పారు. ఆయనకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ జరిగిందని ఇటీవల ఇంటికెళ్లి చూసొచ్చానని పేర్కొన్నారు. అయితే అతని ఆపరేషన్ అయ్యేందుకు చంద్రబాబే కారణం అని తెలుసుకొన్నానని చెప్పారు.

బుచ్చయ్యను గిల్లిన చంద్రబాబు

బుచ్చయ్యను గిల్లిన చంద్రబాబు

సభలో ఏ అంశంపైనైనా మాట్లాడే సమయంలో లేవంటి అంటూ గిల్లుతారని చెప్పారు. అలా గిల్లడం వల్లే ఆయన ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తండ్రి స్థానంలో ఉన్న చంద్రబాబు.. తన కుమారుడు లోకేశ్‌కే కాక మిగతావారికి కూడా బుద్ధిచెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకోసమే మార్షల్‌పై లోకేశ్ రెచ్చిపోయాడని చెప్పారు. రాష్ట్రానికి తానే ఎప్పటికీ సీఎం అని చంద్రబాబు భావిస్తుంటే.. తాను సీఎం కుమారుడినని లోకేశ్ భావిస్తున్నారని పేర్కొన్నారు.

English summary
ap assembly resolution on chandrababu naidu lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X