వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడు మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు: అసెంబ్లీలోకి ఎంట్రీపై ఆంక్ష‌లు: ఈ నిర్ణ‌యం వెనుక‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా వైయస్సార్ ఉన్న స‌మ‌యంలో ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ విరుచుకుప‌డే వారు. టీడీపీకి అనుకూలం గా..కాంగ్రెస్‌కు ప్ర‌త్యేకించి త‌న‌కు వ్య‌తిరేకంగా నిత్యం క‌ధ‌నాలు రాస్తున్నాయ‌నే ఆగ్ర‌హంతో వైయ‌స్ ఆ రెండు ప‌త్రిక‌ల ను ల‌క్ష్యంగా ఎంచుకున్నారు. వైయ‌స్ కుటుంబం సొంతంగా మీడియా సంస్థ‌లు ఏర్పాటు చేయాల‌నికి కార‌నం కూడా అదే. ఇక‌, వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ సైతం తొలుత ఆ రెండు సంస్థ‌ల మీద వ్య‌తిరేకంగా ఉండేవారు. జ‌గ‌న్ కేసు ల విష‌యంలో ఆ రెండు ప‌త్రిక‌లు అత్యుత్సాహం చూపించాయ‌ని వైసీపీ నేత‌లు ఆరోపించేవారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత‌..ఏపీ శాస‌న‌స‌భ‌లో ఆ మూడు మీడియా సంస్థ‌ల మీద ఆంక్ష‌లు విధించారు. ఆ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు నో ఎంట్రీ అని తేల్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ఆ రెండు ప‌త్రిక‌ల నుండి ఈ మూడు సంస్థ‌ల వ‌ర‌కూ..

ఆ రెండు ప‌త్రిక‌ల నుండి ఈ మూడు సంస్థ‌ల వ‌ర‌కూ..

2004లో అధికారం చేప‌ట్టిన త‌రువాత ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ ఉన్నంత కాలం ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ రెండు ప్ర‌ముఖ సంస్థ‌ల మీద వైయ‌స్ ఫైర్ అయ్యేవారు. చంద్ర‌బాబుకు అనుకూలంగా త‌న‌కు వ్య‌తిరేకంగా ఆ రెండు ఉద్దేశ పూర్వ‌కంగా క‌ధ‌నాలు ఇస్తున్నాయ‌నేది నాడు వైయ‌స్ ఆరోప‌ణ‌. వైయ‌స్ ఉన్నంత కాలం అదే వాద‌న కొన‌సాగించారు. ఇక‌, జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయిన త‌రువ‌త సైతం ఆ రెండు ప‌త్రిక‌ల మీద అదే ర‌కంగా ప్ర‌చారం సాగింది. ప్ర‌ధానంగా జ‌గ‌న్ పైన అక్ర‌మ ఆస్తుల కేసులు న‌మోదైన స‌మ‌యంలో అప్ప‌టి సీబీఐ అధికారుల నుండి ఆ రెండు ప‌త్రిక‌లకే ఎక్కువ‌గా స‌మాచారం లీక్ అయ్యేది. దీంతో.. వైసీపీ నేత‌ల‌కు ఆ క‌ధ‌నాల్లో జ‌గ‌న్ వ్య‌తిరేక‌త క‌నిపించేద‌ని వైసీపీ నేత‌లు మండి ప‌డేవారు. తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆ రెండు ప‌త్రిక‌లతో పాటుగా మ‌రో రెండు ఛాన‌ళ్లను ఎల్లో మీడియా అంటూ ప్ర‌తీ స‌భ‌లోనూ విమ‌ర్శించేవారు.

ఆ సంస్థ వైసీపీలో..ఈ సంస్థ టీడీపీలో నిషేధం..

ఆ సంస్థ వైసీపీలో..ఈ సంస్థ టీడీపీలో నిషేధం..

ఇక త‌మ మీద ఉద్దేశ పూర్వ‌కంగా బుర‌ద చ‌ల్లుతార‌నే కార‌ణంతో.. ఒక మీడియా సంస్థ‌ను వైసీపీ కార్యాలంలోకి రావ‌ద్ద‌ని వైసీపీ ఆంక్షలు విధించింది. ఆ సంస్థ నిర్వ‌హించే చ‌ర్చ‌ల‌కు సైతం వెళ్ల‌వ‌ద్ద‌ని పార్టీ నేత‌ల‌కు వైసీపీ దిశా నిర్ధేశం చేసింది. అప్ప‌టి నుండి ఆ సంస్థ చ‌ర్చ‌ల్లో వైసీపీ నేత‌లు పాల్గొన‌టం లేదు. ఇక‌.. ఇదే స‌మ‌యంలో టీడీపీ సైతం జ‌గ‌న్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థ పైన ఆంక్ష‌లు విధించింది. టీడీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించే స‌మావేశాలు.. మీడియా సమావేశాల‌కు రావ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో..ఆ సంస్థ పూర్తిగా టీడీపీ కార్య‌క్ర‌మాల క‌వ‌రేజ్‌కు దూరం గా ఉంటోంది. టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి మొద‌లు టీడీపీ నేత‌లు జ‌గ‌న్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థ‌..పత్రిక పైన తీవ్ర ఆరోప‌ణ‌లు చేసేవారు. ఆ ర‌కంగా రెండు సంస్థ‌ల మీద మీడియా వార్ జ‌రుగు తూనే ఉంది. కానీ, ఎప్పుడూ అసెంబ్లీలో ఆంక్ష‌లు విధించ‌లేదు.

ఆ మూడు మీడియా సంస్థ‌ల పైన ఆంక్ష‌లు..

ఆ మూడు మీడియా సంస్థ‌ల పైన ఆంక్ష‌లు..

నాలుగు రోజుల క్రితం టీడీపీకి చెందిన ముగ్గురు శాస‌న‌స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌భ నుండి ఈ స‌మావేశాలు పూర్త‌య్యే వ‌ర‌కూ స‌స్పెండ్ చేసారు. అయితే వారు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఎమ్మెల్యే రామానాయుడుని అసెంబ్లీ మార్ష‌ల్స్ తీసుకొస్తున్న స‌న్నివేశాల‌ను ఫొటో తీసి ప్ర‌చురించారు. స‌భ‌లో స‌మావేశాలు కొన సాగుతున్న స‌మ‌యంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌కూడ‌దు. దీనిని భిన్నంగా సభ సాగుతుండగా టీడీపీ నిరసన కార్యక్రమాలను లైవ్ ఇచ్చినందుకు అసెంబ్లీ అధికారులు ఆయా ఛానళ్ళపై చర్యలకు ఉపక్రమించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో..ఆ మూడు మీడియా సంస్థ‌ల పైన ఆంక్ష‌లు విధిస్తూ అసెంబ్లీ కార్యాద‌ర్శి మూడు సంస్థ‌ల కార్యాల‌యాల‌కు లేఖ‌లు రాసారు. ఆ మూడు మీడియా సంస్థ‌ల కెమెరామెన్లు, కెమెరాలను అసెంబ్లీ మీడియా పాయింట్ లోకి కూడా అనుమతించటం లేదు. రిపోర్టర్లను మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఈ నిర్ణ‌యం రాజ‌కీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

English summary
AP Assembly serious on Three Media Organisation which violation of Assembly rules. Assembly secretary restricted entry for three media representatives entry in to Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X