వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు బెదిరించ‌కండి : స్పీక‌ర్ సీరియ‌స్‌: ప‌్ర‌తిప‌క్ష నేత వాగ్వాదం...సానుభూతి కోస‌మా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ స‌భ్యుల తీర పైన స్పీక‌ర్ ప్ర‌తీ రోజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రోజు స‌మావేశంలో ఏకంగా ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు పై స్పీక‌ర్ సీరియ‌స్ అయ్యారు. చంద్ర‌బాబు గారు బెదిరించ కండి అంటూ ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించారు. దీని పైన చంద్ర‌బాబు స్పీక‌ర్‌తో కొద్ది సేపు స్వ‌ల్ప వాగ్వాదానికి దిగారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత తీరును త‌ప్పుబ‌ట్టారు. అదే స‌మ‌యంలో ఇక నుండి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో సంత‌కాలు చేసి ప్ర‌శ్న‌లు ప్ర‌తిపాదించిన వారికే అవ‌కాశం ఉంటుందని స్పీక‌ర్ రూలింగ్ ఇచ్చారు. సభ‌లో సీట్ల కేటాయింపు పైనా టీడీపీ -ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం న‌డిచింది.

స‌భ‌లో సీట్ల గురించి ర‌గ‌డ‌...

స‌భ‌లో సీట్ల గురించి ర‌గ‌డ‌...

ఏపీ శాస‌న‌స‌భ‌లో సీట్ల గురించి ర‌గ‌డ చోటు చేసుకుంది. స‌భ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిన మీ సీట్లో కూర్చోండి అంటూ స్పీక‌ర్ సూచ‌న చేయ‌గా..గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సీట్లో కూర్చుంటే తాను కూర్చుంటాన‌ని కోటం రెడ్డి స్ప‌ష్టం చేసారు. దీంతో..స్పీక‌ర్ టీడీపీ స‌భ్యుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని మీ సీట్లో కూర్చోవాల‌ని సూచించ‌గా.. ఆయ‌న సీటు చంద్ర‌బాబు ప‌క్క‌నే అని..అక్క‌డ కూర్చోమ‌ని ఆదేశించాల‌ని కోటంరెడ్డి ప‌ట్టుబ‌ట్టారు. దీంతో..చంద్ర‌బా బు సీట్ల‌లో స‌ర్దుబాటు చేసుకొనే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. దీనిని ప‌రిశీలిస్తాన‌ని స్పీక‌ర్ హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌క్క‌న ఉన్న అచ్చెన్నాయుడును త‌ప్పించి ఆ స్థానంలో బుచ్చ‌య్య చౌద‌రిని కూర్చోవాల‌ని సూచించారు. దీని పైన చ‌ర్చ సాగుతుండ‌గానే..పూర్త‌యిన నీటి పారుద‌ల ప్రాజెక్టుల గురించి అచ్చెన్నాయుడు త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల పైన స్పీక‌ర్ సీరియ‌స్ అయ్యారు.

చంద్ర‌బాబుగారు బెదిరించ‌కండి.

స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చేసిన ప్ర‌తిపాద‌న పైన చంద్ర‌బాబు స్పందించారు. సాంప్ర‌దాయాల‌ను లేనివి ఎలా తీసుకొస్తారు.. అంటూ ఒకింత ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించారు. దీని పైన స్పీక‌ర్ సీరియ‌స్ అయ్యారు. చంద్ర‌బాబు గారు బెది రించ‌కండి..న‌న్నెవ‌రూ బెదిరించ‌లేరు అని సీరియ‌స్ అయ్యారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసారు. దీంతో వైసీపీ స‌భ్యులు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి..అంబ‌టి రాంబాబు జోక్యం చేసుకొని చంద్ర‌బాబు తీరును త‌ప్పు బ‌ట్టారు.
ఇప్పుడు సంప్ర‌దాయాలు మాట్లాడుతున్న చంద్ర‌బాబు మ‌రి రోజాను సస్పెండ్ చేసిన స‌మ‌యంలో ఏమ‌య్యాయ‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో స‌భ‌లో స‌భ్యుల తీరు..అనుమ‌తుల పైన స్పీక‌ర్..ప్ర‌తిప‌క్ష నేత మ‌ధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆనం స్పందిస్తూ చంద్రబాబు మాత్ర‌మే కాదు..తాము స‌భ‌లో సీనియ‌ర్ల‌మే అంటూ ఆనం వివ‌రించారు. ఈ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకున్నారు.

చంద్ర‌బాబు గారూ..సానుభూతి కోసం డ్రామాలు వ‌ద్దు..

చంద్ర‌బాబు గారూ..సానుభూతి కోసం డ్రామాలు వ‌ద్దు..

స‌భ‌లో జ‌రుగుత‌న్న గంద‌ర‌గోళం పైన జోక్యం చేసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..ప్ర‌తిప‌క్ష నేత‌ను ఉద్దేశించి ప్ర‌శ్న‌లు సంధించారు. ప్ర‌తీ విష‌యాన్ని వివాదం చేసి సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సీఎం ఆరోపించారు. సీటింగ్ గురించి మాట్లాడుతున్న చంద్ర‌బాబు..ఎవ‌రు ఎక్క‌డైనా కూర్చోవ‌చ్చ‌ని చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. అదే విధంగా పూర్త‌యిన ప్ర‌శ్న‌కు తిరిగి అవ‌కాశం ఎలా ఇస్తార‌ని..గ‌తంలో మీరు ఎలా చేసారో గుర్తు చేసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఇక‌..40 ఏళ్ల అనుభ‌వం అంటారు..ఎంత అనుభ‌వం ఉన్నా స‌భ‌లో సంప్ర‌దాయాలు ఒకే విధంగా ఉంటా య‌ని..అవి పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు.

English summary
AP Assembly sessions creating political heat. Speaker Seetaram warned Chandra Babu do not try to threaten Chair. CM jagan suggested Chandra Babu to follow house rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X